తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : త్వరలో కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున విజయశాంతి ప్రచారం

By Siva Kodati  |  First Published Nov 19, 2023, 9:40 PM IST

బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి త్వరలో పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ శివారులో వున్న నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం నిర్వహించనున్నారు. 


బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి త్వరలో పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ శివారులో వున్న నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రచార సమన్వయం కోసం కమిటీలు వేశామని పేర్కొన్నారు. ఈ నెల 28 వరకు ప్రచారం, వ్యూహంపై చర్చించామని విజయశాంతి వెల్లడించారు. ఇప్పటికే అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారని, ఈ నెల 28 వరకు వారి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు. 

అంతకుముందు విజయశాంతి మాట్లాడుతూ.. తాను బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ విపక్షంలో వున్నప్పుడు ఏడేళ్లు జెండా మోశానని ఆమె తెలిపారు. సంజయ్, కిషన్ రెడ్డి తదితర నేతలు తన వద్దకు వచ్చి బీఆర్ఎస్ అవినీతిపై చర్చలు వుంటాయని చెప్పారని విజయశాంతి తెలిపారు. మీరంతా సమర్ధిస్తే బీజేపీపై కొట్లాడతామని.. తనను, వివేక్ వెంకట స్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఒప్పించారని ఆమె పేర్కొన్నారు. దీంతో తామంతా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లామని విజయశాంతి చెప్పారు. మమ్మల్ని మోసగించి, బీఆర్ఎస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని అందుకే బీజేపీని పలువురు నేతలు వీడారని ఆమె పేర్కొన్నారు. 

Latest Videos

ALso Read: Vijayashanthi: కేసీఆర్ స్ట్రాటజీని విజయశాంతి దెబ్బతీసినట్టేనా? ఆమెతో కాంగ్రెస్‌కు కలిసివచ్చేదేమిటీ?

కాగా.. విజయశాంతి బీజేపీనుంచి కాంగ్రెస్ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్లు కూడా ముగియడంతో విజయశాంతికి టీ కాంగ్రెస్ లో సముచిత స్థానాన్ని కేటాయించారు. తెలంగాణ ఎన్నికల కోసం ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీని కాంగ్రెస్ నియమించింది. ఇందులో 15 మందికి కన్వీనర్ పోస్టులు ఇచ్చింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ లోకి విజయశాంతిని తీసుకున్నారు. విజయశాంతిని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా పదవి ఇచారు. 

మహేశ్వరం టికెట్కు ఆశించిన  పారిజాతకు కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు. అభ్యర్థుల పేర్లనూ ప్రకటించారు. 15 మందికి కన్వీనర్లు ఎవరంటే..  కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్ అలీబిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్, ఓబెద్దుల కోత్వాల్, రామ్మూర్తి నాయక్, తదితరులు ఉన్నారు. 

click me!