తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : హైదరాబాద్‌లో పట్టుబడ్డ రూ.7.4 కోట్లు.. దర్యాప్తు ముమ్మరం, 10 మందికి నోటీసులు

By Siva Kodati  |  First Published Nov 19, 2023, 8:59 PM IST

రెండ్రోజుల క్రితం హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్ద కార్లలో తరలిస్తున్న రూ.7.4 కోట్ల నగదు పట్టుబడటం కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఖమ్మంకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత సన్నిహితుల ప్రమేయం వున్నట్లుగా భావిస్తున్నారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు, అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సరైన పత్రాలు లేని నగదు, నగలు, బహుమతులు వంటి వాటిని సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వందల కోట్ల డబ్బు పట్టుబడింది. రానున్న రోజుల్లో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం వుంది. కాగా.. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్ద కార్లలో తరలిస్తున్న రూ.7.4 కోట్ల నగదు పట్టుబడటం కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఖమ్మంకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత సన్నిహితుల ప్రమేయం వున్నట్లుగా భావిస్తున్నారు. 

ఈ కేసుకు సంబంధించి మొయినాబాద్ పోలీసులు 10 మందికి 41 ఏ నోటీసులు జారీ చేశారు. ఈ నగదును మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ పరిధిలో ఓ విద్యాసంస్థల ఛైర్మన్‌కు చెందిన ఫాంహౌస్ నుంచి తరలించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు నేపథ్యంలో సదరు ఫాంహౌస్, ఆ ఛైర్మన్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, లాకర్ కీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని పోలీసులు కోర్టులో జమ చేయనున్నారు. 

Latest Videos

undefined

ALso Read: Karimnagar: నగదు కరువై ఆస్తి పత్రాలు పట్టుకుని తిరుగుతున్న అభ్యర్థులు.. కాసుల్లేకుండా క్యాంపెయిన్ కష్టమేగా!

మరోవైపు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.625 కోట్లను పట్టుకున్నట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. అక్టోబర్ 9 నుంచి నేటి వరకు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో గత 24 గంటల వ్యవధిలోనే రూ.22.46 కోట్లనపు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఇప్పటి వరకు రూ.99.49 కోట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోగా, రూ.34.35 కోట్ల మత్తు పదార్ధాలను సీజ్ చేశారు. అలాగే మరో రూ.78.62 కోట్ల విలువైన ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

click me!