కెసిఆర్ నాటిన విత్తనం బీజేపీలో సంజయ్ ని మార్చేసింది.. విజయశాంతి

By SumaBala Bukka  |  First Published Nov 18, 2023, 1:49 PM IST

మోడీ, అమిత్ షా, నడ్డాలను నేను అడుగుతున్నాను.. తెలంగాణకి మీరు ఎప్పుడు వచ్చినా కేసిఆర్ అవినీతిపరుడు, కుటుంబ పాలన అని చెబుతుంటారు. కెసిఆర్ అవినీతికి సంబంధించి ఆధారాలు అన్ని మీ దగ్గర ఉన్నా కూడా మీరు ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. 


హైదరాబాద్ : బండి సంజయ్ ని మార్చిన తర్వాత బిజెపి గ్రాఫ్ పడిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత విజయశాంతి. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. శనివారం గాంధీభవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. బిజెపిలో ఉన్న నేత అసైన్డ్ భూముల కేసు ఏమయిందని బీజేపీని ప్రశ్నించారు. బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటే అని అర్థమయిందన్నారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ అవినీతిని కక్కిస్తుంది అన్నారు. 

కెసిఆర్ నాటిన విత్తనం బిజెపిలో సంజయ్ ని మార్చేసిందని విజయశాంతి మండిపడ్డారు. బీజేపీ నేతలు, కార్యకర్తలకు ఇచ్చిన మాటకు బిజెపి పెద్దలు కట్టుబడి ఉంటారనుకున్నాను. కానీ అలా జరగలేదు. కేసిఆర్ కుటుంబ అవినీతి వివరాలన్నీ మోడీ వద్ద ఉన్నాయి. నెలలు గడిచినా కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కాలేదు. ఎందుకిలా చేశారని నేను ఈ రోజు మోడీ గారిని అడుగుతున్నాను అన్నారు. మేడిగడ్డ కూలిపోతుంటే బిజెపి ఏం చేస్తుందని ప్రశ్నించారు. 

Latest Videos

undefined

టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ గా విజయశాంతి...

విజయశాంతి ఇంకా మాట్లాడుతూ.. ఏసిసి అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో శుక్రవారం నాడు కాంగ్రెస్లో చేరాను. పాత మిత్రులతో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బిజెపి చేసిన పెద్దతప్పే నేను కాంగ్రెస్లోకి రావడానికి కారణం. తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడిన నాయకురాలిగా, ఉద్యమ నాయకురాలిగా ఉన్నాను.  రాష్ట్రమే నాకు ముఖ్యమని 25 సంవత్సరాలుగా పనిచేశాను. కెసిఆర్ అవినీతిపరుడని ఆయనని లోపల వేసి చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు బిజెపి అధిష్టానం మాట ఇచ్చింది. 

కానీ ఆ మాటను తప్పింది. సంవత్సరాలు గడుస్తున్న కేసీఆర్ పై ఎలాంటి చర్యలు లేవు. అమిత్ షా, మోడీ, నడ్డాలను నేను అడుగుతున్నాను..  తెలంగాణకి మీరు ఎప్పుడు వచ్చినా కేసిఆర్ అవినీతిపరుడు, కుటుంబ పాలన అని చెబుతుంటారు. కెసిఆర్ అవినీతికి సంబంధించి ఆధారాలు అన్ని మీ దగ్గర ఉన్నా కూడా మీరు ఎందుకు ఇప్పటి వరకు అతని మీద చర్యలు తీసుకోలేదు. ప్రధానమంత్రిగా మోడీ గారికి అన్ని హక్కులు ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఒక తెలంగాణ ఉద్యమకారురాలిగా అడుగుతున్నాను’ అన్నారు.

బిజెపి బీఆర్ఎస్ లు రెండు ఒకటే…వీరు తెర ముందు ఒకరకంగా తెర వెనుక ఒకరకంగా మాట్లాడుతుంటారు. గత నాలుగు నెలలుగా బిజెపిలో మౌనంగా ఉన్నాను. ఇక అక్కడ ఉండలేక రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి చేరాను.  బీఆర్ఎస్ బిజెపిలోకి ఒక నాయకుడిని మొక్క నాటినట్లు నాటారు. ఆ నాయకుడు అధ్యక్షుడిని మార్చాలని పదేపదే చెప్పి చివరికి అధిష్టానంతో ఆ పని చేయించాడు. చేతులారా బిజెపి పార్టీని నాశనం చేసుకున్నారు.  

ఇవన్నీ మాట్లాడుతుంటే నా మీద ఘాటైన హెడ్డింగ్స్ పెట్టించారు. డబ్బుకోసం పదవుల కోసం లొంగే వ్యక్తిని కాదు. నా మీద కొంతమంది లీడర్లు అసభ్యంగా మాట్లాడారు. వారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. మా గురువు అద్వానీ గారు విలువైన రాజకీయాలు చెప్పారు. కానీ, ఇప్పటి బిజెపి నేతలకు అలాంటి విలువలు లేవు. నన్ను మోసం చేసింది కానీ, ఇంకెవరూ మోసం చేయలేదు’  అని  చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే గెలిపించుకోవాలన్నారు.

click me!