అది చెప్పకపోతే ప్రజలు నమ్మరు.. పీసీసీ సర్వేపై విజయశాంతి మండిపాటు..

Published : Jun 19, 2023, 09:50 AM IST
అది చెప్పకపోతే ప్రజలు నమ్మరు.. పీసీసీ సర్వేపై విజయశాంతి మండిపాటు..

సారాంశం

వచ్చే ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయో అని పీసీసీ చేసిన సర్వే మీద బీజేపీ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్ : బిజెపి నేత విజయశాంతి పిసిసి సర్వే మీద విరుచుకుపడ్డారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ చేసిన ఆ సర్వే మీద విజయశాంతి మండిపడ్డారు. ఆ సర్వే నమ్మాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిచే సీట్లు ఏవో కూడా పీసీసీ తెలియజేయాలని.. అది ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

పీసీసీ చేసిన సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 45 సీట్లు.. కాంగ్రెస్కు 45.. బిజెపికి 7.. ఎంఐఎంకి 7..  వస్తాయని.. ఇవి కాక మిగిలిన 15 సీట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంటుందని ఆ సర్వేలో తెలిపింది. అయితే ఈ సర్వేను నమ్మాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిచే సీట్లు ఏవో కూడా పీసీసీ తెలియజేస్తేనే ప్రజలకు అర్థమవుతుందని ఆమె అన్నారు. 

జూన్ 23న పాట్నాలో విపక్షాల సమావేశం.. దూరంగా ఉండనున్న బీఆర్ఎస్..!!

లేదంటే జిహెచ్ఎంసి, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికలలో వచ్చిన ఫలితాల దృష్ట్యా ఆ సర్వే అసమ్మంజసమైనదిగా అనుకునే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తు చేశారు. పిసిసి సర్వే మీద ఈ మేరకు విజయశాంతి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

ఇదిలా ఉండగా, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారనే ప్రచారం ఇటీవల జోరుగా వినిపించింది. అయితే.. విజయశాంతి ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాను బీజేపీని వదలనని, పార్టీలోనే ఉంటాననిజూన్ 6న క్లారిటీ ఇచ్చారు.  అసత్య ప్రచారంపై విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

‘‘రాములమ్మ బీజేపీ పార్టీకి దూరమవుతున్నారంటూ రెండు రోజుల నుండి ప్రచారం జరుగుతుంది. పార్టీతో అభిప్రాయభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుందిది. అయితే.. ఇలాంటి ప్రచారం చేసేవాళ్లు ఇది సరైనదో..  కాదో ..తెలుసుకోవాలి. నేనైతే మహాశివుని కాశీ మహాపుణ్యక్షేత్రం, *"గరళకంఠుని"* సన్నిధానంలో ఆ ఆది దేవుని దర్శనార్థమై... హరహర మహాదేవ్’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.తనకు టీబీజేపీతో సమస్యలు ఉన్నట్లు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?