మల్కాజిగిరి బాలుడి కిడ్నాప్ కేసులో షాకింగ్ విషయాలు.. మత్తు ఇచ్చి, ఆపరేషన్ చేసి, జ్ఞాపకం చెరిపేయాలని...

By SumaBala Bukka  |  First Published Jun 19, 2023, 7:20 AM IST

మల్కాజిగిరిలో 8వ తరగతి బాలుడి కిడ్నాప్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాము అడిగిన డబ్బులు అందాక బాలుడికి మత్తు ఇచ్చి, ఆపరేషన్ చేసి, జ్ఞాపకం చెరిపేయాలని చూసినట్టుగా కిడ్నాపర్లు తెలిపారు. 


హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మల్కాజిగిరిలో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యవహారం సుఖాంతం అయింది. అయితే ఈ కిడ్నాప్ కేసులో నిందితులు తెలిపిన విషయాలు పోలీసులను కంగుతినేలా చేశాయి. ఈ కేసు వెలుగు చూసినప్పటి నుంచి లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేశారు కొంతమంది నిందితులు. ఆ బాలుడు తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేసి.. ఆ డబ్బులు వచ్చాక అతనికి జ్ఞాపకాలను చెరిపేయాలని అనుకున్నారట. 

అలా తాము పోలీస్ ల నుంచి తప్పించుకోవచ్చనుకున్నారు. ఇది తెలిసిన పోలీసులు అవాక్కయ్యారు. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగా ఈ పిచ్చి ప్రణాళికలు వేసిన వారి వ్యూహం బెడిసి కొట్టడంతో పోలీసుల చేతికి చిక్కారు. ఆదివారం తెల్లవారుజామున ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారణ సుంకేసుల శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతను కడపకు పారిపోయాడు. అంతకుముందే మిగతా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారు ఇచ్చిన సమాచారంతోనే శివను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

Latest Videos

వీడిన రిటైర్డ్ ఎంపీడీవో హత్య కేసు మిస్టరీ.. అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి , వెలుగులోకి కీలక విషయాలు

శివ తన స్వస్థలమైన అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కి కుటుంబంతో సహా వచ్చి మౌలాలిలో స్థిరపడ్డాడు. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ ఉండేవాడు. ఆ వ్యాపారంలో నష్టపోవడంతో సుంకేసుల రవి, మహిపాల్, దిలీప్,  మరో మైనర్ బాలుడితో కలిసి కిడ్నాప్ వ్యూహం పన్నాడు. బిల్డర్ రూపినేని శ్రీనివాస్  తమ ఇంటి పక్కనే ఉంటాడు. అతని చిన్న కొడుకు హర్షవర్ధన్ ను కిడ్నాప్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేయాలని ప్లాన్ వేశారు. అలాగే ప్లాన్ మొత్తం అమలు చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత హర్షవర్ధన్ ను ఉమ్మడి వరంగల్ జిల్లాలో జూన్ 15, 16 తేదీల్లో కారులోనే పలు ప్రాంతాలకు తిప్పారు.

ఆ తర్వాత ప్లాన్ ను కడప నుంచి అమలు చేయాలనుకున్నారు.  దీనికోసం 16వ తేదీ ఉదయం శివ కడపకు వెళ్ళాడు. అక్కడినుంచి హర్షవర్ధన్ తండ్రికి ఫోన్ చేసి రూ.2కోట్లు  డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు అతని ఇవ్వగానే అవన్నీ తీసుకుని కడపకు రావాలని మిగతా టీం సభ్యులకు సూచించాడు. ఈ క్రమంలోనే బాలుడు తనను గుర్తుపట్టే అవకాశం ఉన్నందున అతడి జ్ఞాపకాలను చెరిపేయాలనుకున్నాడు.  దీనికోసం బాలుడికి మత్తుమందిచ్చి, ఆపరేషన్ చేయించాలని ఆలోచించాడు. ఈ మేరకు పోలీసుల ముందు ప్రధాన నిందితుడు ఒప్పుకున్నాడు.  

ఇక వీరి టీంలో ఉన్న మైనర్ బాలుడికి రూ.20వేలు చేతి  ఖర్చులకోసం ఇచ్చారు.  అదన చేయాల్సిన పనుల్లో హర్షవర్ధన్ ను తీసుకువచ్చి కారులోకి ఎక్కిస్తే చాలు. అతని కావాల్సిన డబ్బు ఇస్తామని చెప్పారు.  అయితే పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని  పరిష్కరించడంతో వీరి ప్లాన్ అంతా అట్టర్ ప్లాఫ్ అయింది. 

click me!