
హైదరాబాద్: Hyderabad గండిపేట మండలం మంచిరేవులలోని 142 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. పదేళ్ల సుదీర్థ విచారణ తర్వాత శుక్రవారం నాడు ఈ కేసులో తెలంగాణ హైకోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది.
Manchirevulaలోని సర్వే నెంబర్ 391/1 నుండి 391 /20 లోని 142 ఎకరాల భూమి ప్రభుత్వ భూమేనని Telangana High court స్పష్టం చేసింది. ఈ భూమి తమదంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు 2010లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది.
ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం గ్రేహౌండ్స్ కు కేటాయించింది. అయితే ఈ భూమి తమదని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టులో పోలీస్ శాఖ తరపున డీజీపీ, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీలు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అడ్వకేట్ జనరల్ ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా పనిచేశారని హైకోర్టు అభినందించింది. ఈ భూములపై నాంప్లి క్రిమినల్ కోర్టుల్లో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.
మంచిరేవులలోని 142 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 10 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలంగాణ హైకోర్టు విచారణ సందర్భంగా తెలిపింది. ఇంత విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడిన అధికారుల తీరుపై హైకోర్టు ప్రశంసలు కురిపించింది.