ఆర్థిక ఇబ్బందులు : నల్గొండలో విద్యావాలంటీర్ ఆత్మహత్య !!

Published : Apr 13, 2021, 05:07 PM IST
ఆర్థిక ఇబ్బందులు : నల్గొండలో విద్యావాలంటీర్ ఆత్మహత్య !!

సారాంశం

ఆర్థిక ఇబ్బందులతో నల్గొండ ‌లో ఓ విద్యావాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. 

ఆర్థిక ఇబ్బందులతో నల్గొండ ‌లో ఓ విద్యావాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. 

నల్గొండలో విద్యావాలంటీర్ గా పనిచేస్తున్న పాలకూరి శైలజ( 30) 15 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. సోమవారం రాత్రి నల్గొండ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు క్రిందపడి  శైలజ ఆత్మహత్య చేసుకుంది.

శైలజ, ఆమె భర్త ఇద్దరూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే. శైలజ భర్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగం రెన్యూవల్ కాక, జీతం లేక, 4 ఏళ్ళ పాపకి తిండి కూడా పెట్టలేకపోతున్నారు. పూట గడవడం కష్టంగా మారిపోయింది. దీంతో భర్త పడుతున్న ఆవేదనను చూసిన శైలజ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. 

కరోనా దెబ్బ: మొన్న టీచర్ ఆత్మహత్య, ఈ రోజు భార్య బలవన్మరణం...

కరోనా మూలంగా 15 నెలలుగా జీతాలు లేకుండా జీవితాలను నెట్టకొస్తున్న  విద్యావాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నిరుద్యోగ జెఏసి చైర్మన్ కోటూరి మానవతారాయ్ ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే విద్యావాలంటీర్లను రెన్యవల్ చేసి విధుల్లోకి తీసుకుని జీతాలివ్వాలని మానవతారాయ్ డిమాండ్ చేశారు. 

శైలజ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu