మంత్రి జగదీశ్ రెడ్డికి నిరసన సెగ... నడిరోడ్డుపై నిలదీసిన టీచర్

By Arun Kumar PFirst Published Apr 13, 2021, 4:55 PM IST
Highlights

కరోనా కారణంగా గత ఏడాదికాలంగా స్కూల్స్ మూతపడటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ ప్రైవేట్ టీచర్ నుండి మంత్రి జగదీశ్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. 

నాగార్జునసాగర్: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి ఇవాళ(మంగళవారం) నిరసన సెగ తగిలింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో అనుమల మండలం కొత్తపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు మద్దతుగా మంత్రి ప్రచారం చేపట్టారు. అయితే కరోనా కారణంగా గత ఏడాదికాలంగా స్కూల్స్ మూతపడటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ ప్రైవేట్ టీచర్ నుండి ఆయనకు నిరసన సెగ తగిలింది. 

మంత్రి జగదీశ్ రెడ్డిని నడిరోడ్డుపై అడ్డుకున్న ఓ ప్రైవేట్ టీచర్... నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశాడు. అయితే మంత్రి కూడా సదరు టీచర్ కు ఘాటుగా జవాభిచ్చాడు. ''నీలాంటి వాళ్లను చాలామందిని చూశాం... నిన్ను ఎవరు పంపించారో తెలుసు... నీతో పాటు మీ నాయకులపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తాం'' అని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. 

read more   హలియాలో కేసీఆర్ సభకు తొలగిన అడ్డంకులు: రైతుల హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ

ఈ క్రమంలో మంత్రిని మరేదో విషయంపై ప్రశ్నించాలని సదరు టీచర్ భావించగా పోలీసులు రంగప్రవేశం చేశారు. వెంటనే ప్రైవేట్ టీచర్ ను పక్కకు లాక్కునివెళ్లగా మంత్రి జగదీశ్ రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగించారు. 
 

click me!