కోర్టుకు శ్రీనివాస్ రెడ్డి: నెలాఖరుకు హాజీపూర్ తుది తీర్పు

By narsimha lode  |  First Published Dec 26, 2019, 12:32 PM IST

హాజీపూర్ కేసులో ఈ నెలాఖరుకు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది.గురువారం నాడు ఈ కేసులో నిందితుడైన మర్రిశ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపర్చారు. 



నల్గొండ:ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో  నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని రాచకొండ పోలీసులు గురువారం నాడు నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపర్చారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి ఈ కేసు విషయమై ప్రశ్నించే అవకాశం ఉంది.

Also read:హాజీపూర్ కేసు: జడ్జి ప్రశ్నలకు నోరు మెదపని శ్రీనివాస్ రెడ్డి

Latest Videos

ఈ నెలాఖరుకు హాజీపూర్ కేసులకు సంబంధించి నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు శిక్షను విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. డిఎన్ఏ రిపోర్టుతో పాటు ఫింగర్ ప్రింట్స్, ఇతర సాక్ష్యాలను రాచకొండ పోలీసులు ఇప్పటికే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సమర్పించారు. 

ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారంతో పాటు హత్య చేయడంపై  పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో  ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను రాచకొండ పోలీసులు సేకరించి కోర్టుకు సమర్పించారు. 

ఈ ఏడాది ఏప్రిల్ మాసం చివరలో  హాజీపూర్‌లో మర్రి శ్రీనివాస్ రెడ్డి మైనర్ బాలికలపై అత్యాచారం చేసి  హత్య  చేసిన విషయం వెలుగు చూసింది. ఒక్క కేసు విచారణ చేస్తున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను  హత్య చేసిన విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ మూడు హత్యలతో పాటు కర్నూల్ జిల్లాలో కూడ ఓ హత్య కేసులో శ్రీనివాస్ రెడ్డి నిందితుడని అప్పట్లోనే రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు.

ఈ కేసుకు సంబంధించిన నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు రెండు మాసాల పాటు విచారణ చేసింది. 300 సాక్షులను పాస్ట్ ట్రాక్ కోర్టు విచారించింది. పోరెన్సిక్ రిపోర్ట్‌తో పాటు  కీలక సాక్ష్యాలను కూడ పోలీసులు కోర్టకు సమర్పించారు. 

యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపూర్ హత్యల కేస్ విచారణ సందర్భంగా  నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని గురువారం నాడు పోలీసులు జిల్లా జైలు నుండి భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తీసుకువచ్చారు.

ఈ కేసులో 44 మంది సాక్షులను జడ్జి ముందు ఉంచారు పోలీసులు.  వారానికి 5 రోజులు చొప్పున ఇప్పటిదాకా 22 సార్లు ట్రయల్స్ చేసింది కోర్టు.  ఫాస్ట్ ట్రాక్ కోర్టు కంటే వేగంగా ఈ కేసు విచారణ  జరిగింది. 

ఈ ఏడాది అక్టోబర్ 29వ తేదీన కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పై 376/3,366,376/a,302,201సెక్షన్ల కింద నమోదయ్యాయి. 
ఈ నెల చివరి లోపు పూర్తి కానుంది విచారణ. ఈ శిక్ష కూడా ఈ నెల చివరి లోపు పూర్తి ఖరారు అవుతోంది. ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకొంది. ఈ తరుణంలో శ్రీనివాస్ రెడ్డిని  కోర్టులో రాచకొండ పోలీసులు హాజరుపర్చారు. 


 

click me!