హైద్రాబాద్‌లో కారు బీభత్సం: భయంతో జీహెచ్ఎంసీ కార్మికుల పరుగులు

Published : Dec 26, 2019, 08:41 AM ISTUpdated : Dec 26, 2019, 08:50 AM IST
హైద్రాబాద్‌లో కారు  బీభత్సం: భయంతో జీహెచ్ఎంసీ కార్మికుల పరుగులు

సారాంశం

హైద్రాబాద్‌లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా కారు నడపడంతో పుట్‌పాాత్ పైకి చేరింది. ఈ ఘటన గురువాారం నాడు ఉదయం చోటు చేసుకొంది.

హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గురువారం నాడు  ఉదయం ఓ కారు భీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. అంతేకాదు పుట్‌పాత్ మీదికి దూసుకెళ్లింది. దీంతో జీహెచ్ఎంసీ కార్మికులు భయంతో పరుగులు తీశారు.

కారును అతి వేగంగా నడపడంతో అదుపుతప్పి మరో కారును ఢీకొట్టినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అప్పటికీ కూడ కారు వేగం అదుపుకాలేదు. కారు రోడ్డు పక్కనే ఉన్న పుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో జీహెచ్ఎంసీ కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తున్నారు. 

కారు అతివేగంగా పుట్ పాత్ పైకి దూసుకురావడంతో అక్కడే రోడ్లను శుభ్రం చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులు భయంతో పరుగులు తీశారు. కారులో నలుగురు యువకులు ఉన్నట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వీరంతా రాజేంద్రనగర్ అత్తాపూర్‌కు చెందినవారుగా అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే