బిజెపి వైపు చెన్నమనేని రమేష్ చూపు... ఇప్పటికే ఈటలతో చర్చలు?

Published : Aug 22, 2023, 01:58 PM ISTUpdated : Aug 22, 2023, 02:03 PM IST
బిజెపి వైపు చెన్నమనేని రమేష్ చూపు... ఇప్పటికే ఈటలతో చర్చలు?

సారాంశం

బిఆర్ఎస్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం దక్కకపోవడంతో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బిజెపి వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

సిరిసిల్ల : బిఆర్ఎస్ పార్టీ  అధినేత కేసీఆర్ త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కేవలం నాలుగు మినహా అన్ని స్ధానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి ఎక్కువగా సిట్టింగ్ లకే అవకాశం కల్పించిన కేసీఆర్ తొమ్మిదిమందిని మాత్రం మార్చారు. ఇలా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు బిఆర్ఎస్ టికెట్ దక్కలేదు. దీంతో బిఆర్ఎస్ అదిష్టానంపై తిరుగుబాటు చేసి బిజెపిలో చేరేందుకు రమేష్ సిద్దమైనట్లు తెలుస్తోంది.     

బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. ఇలా ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్  కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బిజెపితో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే బిజెపి ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తో చెన్నయనేని మాట్లాడినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుత జర్మనీలో వున్న రమేష్ ఆగస్ట్ 25న వేములవాడకు వచ్చి ముఖ్య అనుచరులు, పార్టీ నాయకులతో భేటీ కానున్నారు. తనకు టికెట్ కేటాయించకపోవడంతో బిఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్న చెన్నమనేని ఏ పార్టీలో చేరాలన్నదానిపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వేములవాడలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిజెపిలో చేరడానికే ఎమ్మెల్యే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

Read More  బీఆర్ఎస్‌ మొండి చేయి: కాంగ్రెస్ టిక్కెట్టు కోసం రేఖా నాయక్ ధరఖాస్తు

ఇప్పటికే తన బాబాయ్, బిజెపి కీలక నేత చెన్నమనేని విద్యాసాగర్ రావుతో రమేష్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈటలతో కూడా మాట్లాడిన రమేష్ అనుచరులతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. అన్నీ కుదిరితే ఈసారి వేములవాడ నుండి బిజెపి అభ్యర్థిగా రమేష్ బరిలోకి దిగనున్నారు.   

వేములవాడ నియోజకవర్గంలో తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు రమేష్. అయితే చెన్నమనేని పౌరసత్వంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈసారి బిఆర్ఎస్ టికెట్ ఆయనకు ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. దీంతో చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు బిఆర్ఎస్ అవకాశం కల్పించింది. దీంతో వారసత్వంగా తాము గెలుచుకుంటూ వస్తున్న వేములవాడ నియోజకవర్గాన్ని వదులుకోడానికి చెన్నమనేని కుటుంబం సిద్దంగాలేదు. అందుకోసమే చెన్నమనేని విద్యాసాగర్ రావు తన అన్నకొడుకు రమేష్ ను బిజెపిలోకి తీసుకువచ్చి వేములవాడ టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ