ఎల్‌బీనగర్ లో గిరిజన మహిళపై దాడి: సీసీటీవీ పుటేజీని సమర్పించాలని హైకోర్టు ఆదేశం

By narsimha lode  |  First Published Aug 22, 2023, 1:24 PM IST

ఎల్ బీ నగర్ లో  గిరిజన మహిళ లక్ష్మిపై  పోలీసుల దాడి ఘటనకు సంబంధించి  సీసీటీవీ పుటేజీని సమర్పించాలని  హైకోర్టు ఆదేశించింది.
 


హైదరాబాద్: ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ లో  గిరిజన  మహిళ లక్ష్మిపై దాడి  చేసిన ఘటనకు సంబంధించి  సీసీటీవీ పుటేజీని సమర్పించాలని  తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.ఈ నెల  15వ తేదీన  ఎల్ బీ నగర్  పోలీసులు గిరిజన మహిళ లక్ష్మిపై దాడి చేశారు. తనపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారని లక్ష్మి  ఆరోపించారు.ఈ  విషయమై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై జడ్జి సూరేపల్లి నంద  తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. దీంతో  ఈ కేసును  తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇవాళ  ఈ ఘటనపై  హైకోర్టు విచారణ  నిర్వహించింది. ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ బయట, లోపల ఉన్న సీసీటీవీ పుటేజీని  అందించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది  హైకోర్టు. 

మీర్‌పేటకు చెందిన లక్ష్మిని  ఎల్ బీ నగర్ పోలీసులు  విచక్షణ రహితంగా కొట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయమై  రాచకొండ సీపీ చౌహాన్ విచారణకు  ఆదేశించారు. విచారణ నిర్వహించిన  ఉన్నతాధికారులు ఇందుకు  బాధ్యులైన  ఇద్దరు కానిస్టేబుళ్లను  సస్పెండ్  చేశారు. ఈ ఘటనకు సంబంధించి  ఎల్ బీ నగర్ పోలీసులపై  కేసు నమోదైంది.  

Latest Videos

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  యాక్ట్ తో పాటు ఇతర సెక్షన్ల కింద  కూడ కేసులు నమోదు చేశారు.  రాత్రంతా నిర్భంధించి తనపై  పోలీసులు దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయమై బాధ్యులైన వారిపై  చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఈ నెల  16న ఆందోళనకు దిగారు.  ఈ విషయమై మంత్రి సత్యవతి రాథోడ్  రాచకొండ  సీపీతో ఫోన్ లో మాట్లాడారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని కూడ  కోరారు.

also read:ఎల్‌బీనగర్ లో గిరిజన మహిళపై పోలీసుల దాడి: సుమోటోగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు

ఎల్ బీ నగర్ చౌరస్తాలో  ముగ్గురు మహిళలు  ఇబ్బంది పెడుతున్నారని  పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు వచ్చి    తీసుకెళ్లి  దాడి చేశారని  బాధితురాలు ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయాలని  పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.పోలీసులను పెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తుందని  విపక్షాలు  ఆరోపిస్తున్నాయి.

click me!