రూ. 40 లక్షల భూమిని.. 10 లక్షలకు లాక్కొన్నారు: ఈటలపై బాధితుల ఆరోపణలు

By Siva KodatiFirst Published Apr 30, 2021, 8:10 PM IST
Highlights

మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన  జమున హ్యాచరీస్ కోసం అక్రమ రోడ్డు నిర్మించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పేద రైతుల భూముల్లోంచి పౌల్ట్రీ కోసం మంత్రి ఈటల రోడ్డు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోడ్డు పనుల్ని రైతులు అడ్డుకున్నారు. అయినప్పటికీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. 

మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన  జమున హ్యాచరీస్ కోసం అక్రమ రోడ్డు నిర్మించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పేద రైతుల భూముల్లోంచి పౌల్ట్రీ కోసం మంత్రి ఈటల రోడ్డు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోడ్డు పనుల్ని రైతులు అడ్డుకున్నారు. అయినప్పటికీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.

మంత్రి అనుచరులు తమను బెదిరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరం 40 లక్షలున్న భూమిని 10 లక్షలు ఇచ్చి లాక్కొన్నారని... భూ హక్కు పత్రాలు తమ దగ్గరున్నా ఇప్పటికీ బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. పౌల్ట్రీ ఫాం ఏర్పాటుతో ఊర్లో భయంకరమైన దుర్వాసన వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాపై స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జిల్లా కలెక్టర్‌తో సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీఎస్ సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు. అలాగే నిజానిజాలు నిగ్గుతేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీని సీఎం ఆదేశించారు.

Also Read:భూకబ్జా ఆరోపణలు: ఈటెల రాజేందర్ పొలిటికల్ జర్నీపై నీలినీడలు?

సత్వరమే ప్రాథమిక నివేదిక అందజేయాలని కేసీఆర్ అధికారులను కోరారు. ప్రస్తుతం జమునా హాచరీస్ పక్కనే వున్న 25 ఎకరాల భూమిని ఇవ్వాలని మంత్రి ఈటల పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వ్యవస్థల్ని ప్రభావితం చేస్తూ తమకు రెగ్యులరైజ్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు అడిషనల్ కలెక్టర్లు, మాజీ కలెక్టర్లు మీడియాకు తెలిపారు. రెండు గ్రామాల్లో పెద్ద ఎత్తున వంద ఎకరాల్లో భూకబ్జాకు పాల్పడ్డారు మంత్రి ఈటల.

బీసీ మంత్రి అయ్యుండి వారి సంక్షేమానికి పాటుపడాల్సింది పోయి అసైన్డ్ భూములు, ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను పెద్ద ఎత్తున కబ్జా చేసినట్లు ఈటలపై ఆరోపణలు వస్తున్నాయి. రెండు గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాల భూములు కబ్జాలకు పాల్పడ్డారు..? ఎంతకు పాల్పడ్డారు..? బాధితులను బెదిరించారా..? ఏం చేశారన్న నిజాలు నిగ్గు తేల్చాలంటూ కేసీఆర్ ఆదేశించారు.

click me!