విరసం నేత వరవరరావు అల్లుళ్లకు ఎన్ఐఏ నోటీసులు

By narsimha lodeFirst Published Sep 7, 2020, 6:47 PM IST
Highlights

విరసం నేత వరవరరావు అల్లుళ్లకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ వరవరరావు అల్లుళ్లను ఆదేశించింది.
 


హైదరాబాద్: విరసం నేత వరవరరావు అల్లుళ్లకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ వరవరరావు అల్లుళ్లను ఆదేశించింది.

విరసం నేత వరవరరావును 2018లో భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రస్తుతం తలోజా జైలులో వరవరరావు ఉన్నారు. వరవరరావు అల్లుడు ఇఫ్లూ యూనివర్శిటీ ప్రోఫెసర్ సత్యనారాయణ ఇంట్లో కూడ  ఆ సమయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

తాజాగా సత్యనారాయణతో పాటు మరో అల్లుడికి కూడ ఎన్ఐఏ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది.ఈ నెల 9వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాలని వారిని ఎన్ఐఏ ఆదేశించింది. తలోజా జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్యం సరిగా లేదని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఇదే విషయమై ఆయన కొంత కాలం క్రితం ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పూర్తైన తర్వాత ఆయనను తిరిగి జైలుకు తరలించారు. అంతేకాదు ఇదే సమయంలో ఆయనకు కరోనా కూడ సోకింది. కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

click me!