మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఎన్‌కౌంటర్: భద్రాద్రి జిల్లాలో ఇద్దరు మావోల మృతి

By narsimha lodeFirst Published Sep 7, 2020, 5:15 PM IST
Highlights

భద్రాద్రి  కొత్తగూడం జిల్లాలో సోమవారం నాడు మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
 


భద్రాచలం: భద్రాద్రి  కొత్తగూడం జిల్లాలో సోమవారం నాడు మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

ఈ నెల 2వ తేదీన ఇదే జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మరణించాడు. మరో మావోయిస్టు తప్పించుకొన్నాడు.చర్ల-ఛత్తీస్ ఘడ్ సరిహద్దు అడవుల్లో  మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

Also read:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్: మావోయిస్టు మృతి

మావోయిస్టులు మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే పోలీసుల ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి.  

ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొంటున్నాయి. ఈ ఏడాది జూలై మాసంలో కూడ ఈ జిల్లాలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనలో మావోయిస్టులు తృటిలో తప్పించుకొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు రిక్రూట్ మెంట్ పై దృష్టిని కేంద్రీకరించారని పోలీసులు గుర్తించారు. 

click me!