ఎల్ఆర్ఎస్ పై 131 జీవో రద్దుకి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటిషన్

Published : Sep 07, 2020, 06:15 PM IST
ఎల్ఆర్ఎస్ పై 131 జీవో రద్దుకి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటిషన్

సారాంశం

భూముల క్రమబద్దీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 131 జీవోను రద్దు చేయాలని కోరుతూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు సోమవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


హైదరాబాద్:భూముల క్రమబద్దీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 131 జీవోను రద్దు చేయాలని కోరుతూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు సోమవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

భూముల క్రమబద్దీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఆగష్టు 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరోవైపు జీహెచ్ఎంసీలో భవనాల క్రమబద్దీకరణపై 2016లో ఫోరం ఫర్ గుడ్ వర్నెన్స్ పిటిషన్ దాఖలు చేసింది.  ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేసింది.

బీఆర్ఎస్ ఏ స్థితిలో ఉందో నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించిందిబీఆర్ఎస్ కోసం ఎన్ని ధరఖాస్తులు వచ్చాయో.. ఎన్ని తిరస్కరించారో చెప్పాలని హైకోర్టు జీహెచ్ఎంసీని ఆదేశించింది. 

also read:గుడ్‌న్యూస్: ఎల్ఆర్ఎస్‌ మార్గదర్శకాలు ఇవీ...

బీఆర్ఎస్ పేరుతో అక్రమ నిర్మాణలు రాకుండా చూడాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పై తదుపరి విచారణను ఈ ఏడాది అక్టోబర్ 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

ఎల్ఆర్ఎస్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 1న  మార్గదర్శకాలను విడుదల చేసింది. లేఅవుట్లు చేయకుండానే ప్లాట్ల క్రయ విక్రయాలు చేసిన వారంతా తమ స్థలాలను క్రమబద్దీకరించుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. టీఎస్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలకు ఎల్ ఆర్ ఎస్ వర్తించనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 1వ తేదీన ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

Mutton : కిలో చికెన్ ధరకే కిలో మటన్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే..!
Kavitha Emotional Speech: నా మీద కక్ష కట్టి పార్టీ నుంచి నెట్టేశారు | Asianet News Telugu