వంటేరు ప్రతాప్‌రెడ్డికి కీలకపదవి: అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియామకం

By Siva KodatiFirst Published Oct 23, 2019, 6:56 PM IST
Highlights

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన గజ్వేల్ నియోజవర్గ నేత వంటేరు ప్రతాప్ రెడ్డికి కీలక పదవి లభించింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్ధ ఛైర్మన్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వంటేరు బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన గజ్వేల్ నియోజవర్గ నేత వంటేరు ప్రతాప్ రెడ్డికి కీలక పదవి లభించింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్ధ ఛైర్మన్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వంటేరు బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

రెండు సార్లు ప్రతాప రెడ్డి కేసీఆర్ పై పోటీ చేసి గజ్వెల్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. నిజానికి, వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని, టీఆర్ఎస్ లోకి వంటేరును కేసీఆర్ ఆహ్వానిస్తారని గానీ ఎవరూ అనుకుని ఉండరు. ఇది ఊహించని పరిణామమే.

Also Read: టీఆర్ఎస్ లో వంటేరు ప్రతాపరెడ్డి చేరికపై "కొత్త" ట్విస్ట్

అయితే, వంటేరు ప్రతాపరెడ్డి టీఆర్ఎస్ లోకి తేవడానికి వెనక మంత్రాంగం నడిపింది కేసీఆర్ మేనల్లుడు, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావేననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

హరీష్ రావు ప్రమేయం లేకుండా ఆయన పార్టీలోకి వస్తారని ఎవరూ ఊహించరు. ఎన్నికలకు ముందు తన మామను ఓడించాలని, అందుకు అవసరమైన నిధులు సమకూరుస్తానని హరీష్ రావు తనకు ఫోన్ చేసి చెప్పారని వంటేరు ప్రతాప రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

హరీష్ రావుతో వంటేరు ప్రతాపరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు. ఆ కారణంగానే వంటేరు తన అభిమతాన్ని ఆయన చెవిన వేశారని సమాచారం. ఆ విషయాన్ని హరీష్ రావు కేసీఆర్ చెవిన వేశారని, కేసీఆర్ అందుకు అంగీకరించారని అంటున్నారు. ప్రతాప రెడ్డి టీఆర్ఎస్ లోకి వస్తే ఆ పార్టీకి వ్యతిరేకంగా నిలబడేది నర్సారెడ్డి మాత్రమే. నర్సారెడ్డి కూడా కాంగ్రెసులో ఉంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిక: హరీష్‌కు చెక్?

భవిష్యత్తులో  గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాజకీయాల్లో  ప్రతాప్ రెడ్డి కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. హరీష్‌ను తప్పించే ఉద్దేశ్యంతోనే ప్రతాప్ రెడ్డిని రంగంలోకి తీసుకొచ్చారా  అనే చర్చ కూడ లేకపోలేదు.

సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి పౌరసరఫరాల సంస్థ ఛైర్మెన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ వీర విధేయుడుగా పేరుంది. టీఆర్ఎస్ రెండో సారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారెడ్డి శ్రీనివాస్ రెడ్డగికి  పౌరసరఫరాల సంస్థ ఛైర్మెన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు.

కొంతకాలంగా శ్రీనివాస్ రెడ్డి  పార్టీ కార్యక్రమాల్లో అంతగా యాక్టివ్ గా లేరు. ఈ తరుణంలో  శ్రీనివాస్ రెడ్డికి పదవి ఇవ్వడాన్ని కూడ ప్రస్తావిస్తున్నారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గం నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

click me!