కేసీఆర్ పై 50 వేల మెజారిటీతో గెలుస్తా: వంటేరు ధీమా

By pratap reddyFirst Published Dec 8, 2018, 12:46 PM IST
Highlights

నాలుగేళ్లుగా మూతపడ్డ సచివాలయాన్ని మళ్లీ తెరిపిస్తామని వంటేరు అన్నారు. గజ్వేల్ ప్రజలు చైతన్య వంతులని, నిజమైన ప్రజాస్వామ్యానికే ఓటు వేశారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో దోచుకున్న వారి భరతం పడతామని ఆయన అన్నారు.

సిద్దిపేట: గజ్వేల్‌లో కేసీఆర్‌పై 50 వేల మెజార్టీతో తాను విజయం సాధిస్తానని ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వెల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు నేత వంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే.

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన విమర్శించారు. నిజమైన స్వాతంత్ర్యం ఈ నెల 11న వస్తుందని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో కేసీఆర్ తెలంగాణను నాశనం చేశారని అన్నారు. 

click me!