ఉద్ధృతంగా మంజీరా నది: జలదిగ్బంధంలో ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయం

By Siva KodatiFirst Published Sep 26, 2021, 9:01 PM IST
Highlights

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మధ్యతరహా ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది.

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మధ్యతరహా ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. దీంతో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది గుడిని మూసివేశారు. ఆలయం వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదలశాఖ అధికారులు హెచ్చరించారు. అయితే భక్తుల దర్శనార్థం రాజగోపురం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

click me!