
హైదరాబాద్ కూకట్‌పల్లిలో భర్త చేతిలో హత్యకు గురైన నవవధువు సుధారాణి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పెళ్లైన 28 రోజులకే భార్యపై అనుమానం పెంచుకున్న కిరణ్.. ఆమెకు తన తండ్రితో అక్రమ సంబంధాన్ని అంటగట్టాడు. అంతేకాదు, రోజూ చిత్రహింసలు పెట్టేవాడని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లయిన రోజు నుంచి భార్యతో తన స్వగ్రామంలోనే వున్న కిరణ్.. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ బాచుపల్లిలోని సొంత ఫ్లాట్‌కొచ్చాడు.
తండ్రితో తన భార్యకు అక్రమ సంబంధం వుందని అనుమానం పెంచుకున్న కిరణ్ ఆమెను హత్య కేసి తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. కిరణ్- సుధారాణికి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే ఈ దారుణం జరగడం కుటుంబసభ్యుల్లో విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.