తెలంగాణలో 200 దిగువకు కొత్త కేసులు.. 6,65,068కి చేరిన మొత్తం సంఖ్య

Siva Kodati |  
Published : Sep 26, 2021, 08:32 PM ISTUpdated : Sep 26, 2021, 08:33 PM IST
తెలంగాణలో 200 దిగువకు కొత్త కేసులు..  6,65,068కి చేరిన మొత్తం సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 170 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ వల్ల ఎవ్వరూ మరణించలేదు. 259 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,612 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 34,200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 170 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,65,068కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఎవరూ కరోనాతో చనిపోలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,912గా వుంది. ఒక్కరోజు వ్యవధిలో 259 మంది మహమ్మారి నుంచి కోలుకోవడంతో తెలంగాణలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,56,544కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,612 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 2, జీహెచ్ఎంసీ 68, జగిత్యాల 2, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 18, ఖమ్మం 5, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 3, మంచిర్యాల 4, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 6, ములుగు 2, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 10, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 0 , పెద్దపల్లి 1, సిరిసిల్ల 2, రంగారెడ్డి 11, సిద్దిపేట 4, సంగారెడ్డి 3, సూర్యాపేట 5, వికారాబాద్ 2, వనపర్తి 0, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 6, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu