నేను చేసింది తప్పే.. దాని వెనుక చెప్పలేనంత పెయిన్ : వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి

By Siva Kodati  |  First Published Dec 13, 2022, 9:53 PM IST

తాను చేసింది తప్పేనని, కానీ దాని వెనుక చాలా బాధ దాగుందని వ్యాఖ్యానించాడు ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు ప్రధాన సూత్రధారి నవీన్ రెడ్డి.  ఆరోగ్య సమస్యల కారణంగా తాను పోలీసులకు సరెండర్ కాలేదని తన మీద చాలా ప్రచారాలు జరుగుతున్నాయని నవీన్ రెడ్డి పేర్కొన్నాడు.


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు ప్రధాన సూత్రధారి నవీన్ రెడ్డిని గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని వద్ద నుంచి ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. అయితే ఈ విషయంపై నవీన్ రెడ్డి కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది. తాను చేసింది తప్పేనని, కానీ దాని వెనుక చాలా బాధ దాగుందని వ్యాఖ్యానించాడు. అతని మాట్లాడినట్లుగా వున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తనకున్న ఆరోగ్య సమస్యల కారణంగా తాను పోలీసులకు సరెండర్ కాలేదని చెప్పాడు. బ్యాడ్మింటన్‌లో తాను ఆడే కోర్టుకే వైశాలి, ఆమె ఇరుగుపొరుగు వచ్చి ఆడేవారని నవీన్ రెడ్డి చెప్పాడు. తర్వాత వైశాలి ఒక్కటే బ్యాడ్మింటన్ ఆడటానికి వచ్చేదని, అక్కడ ఆమె పరిచయం అయ్యిందని తెలిపాడు. ఆట ముగించిన తర్వాత మిస్టర్ టీ వ్యవహారాల్లో తాను బిజీగా వుండేవాడినని చెప్పింది. బ్యాడ్మింటన్ కోర్ట్‌కు సమీపంలోనే తన టీ స్టాల్ వుండటంతో వైశాలితో కబుర్లు చెబుతూ వుండేవాడినని, కొన్నిరోజులకు ఇద్దరి అభిరుచులు కలిశాయని తెలిపాడు. తన మీద చాలా ప్రచారాలు జరుగుతున్నాయని నవీన్ రెడ్డి పేర్కొన్నాడు. దాని వల్ల తన కుటుంబం కూడా బాధపడుతోందని చెప్పాడు. 

Latest Videos

ALso Read:వైశాలి కిడ్నాప్ కేసు.. గోవాలో పోలీసులకు చిక్కిన నవీన్ రెడ్డి, హైదరాబాద్‌కు తరలింపు

కాగా.. వైశాలి  కిడ్నాప్ కేసులో  ఇప్పటికే 32 మందిని  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఈ కేసుకు సంబంధించిన రిమాండ్  రిపోర్టులో  పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. గత ఏడాది బొంగులూరులోని స్పోర్ట్స్ అకాడమీలో వైశాలితో నవీన్  రెడ్డికి పరిచయం ఏర్పడిందని పోలీసులు రిమాండ్  రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సమయంలో  వైశాలి  నెంబర్  తీసుకొని ఆమెకు తరచూ ఫోన్లు, మేసేజ్ లు  చేసేవాడని  పోలీసులు ఈ రిపోర్టు తెలిపింది. కొన్ని రోజుల తర్వాత నవీన్ రెడ్డి  వైశాలి వద్ద పెళ్లి ప్రస్తావన  తీసుకువచ్చాడు. అయితే  తన పేరేంట్స్‌ని అడగాలని వైశాలి నవీన్ రెడ్డికి చెప్పిందని  రిమాండ్ రిపోర్టు తెలిపింది. వైశాలి పేరేంట్స్ ను ఒప్పించేందుకు గాను నవీన్ రెడ్డి  ప్రయత్నించాడు. కానీ నవీన్ రెడ్డికి వైశాలిని ఇచ్చి పెళ్లి చేసేందుకు వారు అంగీకరించలేదు.

దీంతో  వైశాలి కుటుంబంపై నవీన్ రెడ్డి కక్ష పెంచుకున్నారని  రిమాండ్  రిపోర్టు పేర్కొంది.  వైశాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్  ఖాతాను తెరిచి  డాక్టర్ వైశాలితో తాను ఉన్న ఫోటోలను  వైరల్  చేశాడని పోలీసులు రిమాండ్  రిపోర్టు చెబుతుంది. ఐదు మాసాల క్రితం  వైశాలి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా  నవీన్ రెడ్డి  అతని స్నేహితులు హంగామా చేశారు. ఈ విషయమై  వైశాలి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారని రిమాండ్ రిపోర్టు తెలుపుతుంది. 

click me!