తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు

Siva Kodati |  
Published : Dec 13, 2022, 09:12 PM IST
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా వున్న సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది.

కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్ హెడ్ ఆఫీసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్ హెడ్‌గా వున్నారు సునీల్ కనుగోలు. సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపణలు రావడంతోనే ఈ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది.  విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సునీల్ కార్యకర్తలు సునీల్ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర సునీల్ కార్యాలయం వుంది. తనిఖీల సందర్భంగా కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు సీజ్ చేశారు. సోదాల సమయంలో కార్యాలయంలోని సిబ్బంది సెల్‌ఫోన్లు సైతం ఆఫ్ చేయించారు పోలీసులు. గత కొంతకాలంగా కాంగ్రెస్ కోసం పనిచేస్తోంది ఎస్‌కే టీమ్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే