కాంగ్రెస్‌కు సుభాష్ రెడ్డి రాజీనామా.. అనుచరుల సమావేశంలో కన్నీటి పర్యంతం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి  కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది.

Vaddepally Subhash Reddy Resigns congress after not yellareddy ticket ksm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి  కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ మదన్ మోహన్‌కు కేటాయించడంపై వడ్డెపల్లి సుభాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్‌ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సుభాష్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు అనుచరులతో సమావేశమైన సుభాష్ రెడ్డి.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అనుచరుల సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. 

నియోజకవర్గంలో పార్టీ కోసం తాను ఎంతో కష్టపడి పనిచేశానని సుభాష్ రెడ్డి అన్నారు. ‘‘మీరే కాపాడుకుంటరా? చంపుతారా? మీ చేతుల్లోనే ఉంది.. ఏం చేస్తరో మీ దయ’’ అని అనుచరుల సమావేశంలో సుభాష్ రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో అనుచరులు ఆయనను సముదాయించేందుకు యత్నించారు. అయితే ఎలాగైనా సరే ఎల్లారెడ్డి నుంచి పోటీ  చేయాలని సుభాష్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

Latest Videos

ఇదిలాఉంటే, ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన సుభాష్ రెడ్డి గత కొంతకాలంగా నియోజకవర్గంలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్న సుభాష్ రెడ్డి.. మదన్ మోహన్‌కు టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే సుభాష్ రెడ్డి అనుచరుడిగా పేరున్న నాగిరెడ్డిపేట మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటి పై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 
 

vuukle one pixel image
click me!