వ్యాక్సిన్ మోసం : ఒకరి ఆధార్ కార్డుతో మరొకరికి టీకా.. కరీంనగర్ లో విచిత్రం.. (వీడియో)

By AN Telugu  |  First Published Apr 13, 2021, 5:31 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. ప్రజలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.


దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. ప్రజలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరీంనగర్ లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కరోనా టీకా వేయించుకోవడానికి వెళ్లిన వ్యక్తికి.. వ్యాక్సిన్ వేయించుకోకముందే వేయించుకున్నట్టుగా మెసేజ్ వచ్చింది.

Latest Videos

undefined

"

దీంతో షాక్ తిన్న ఆ వ్యక్తి.. వ్యాక్సినేషన్ సెంటర్ లోని సిబ్బందిని అడగగా.. నీ నెం. తో వేరేవాళ్లు రిజిస్టర్ చేసుకున్నారా? అని వాళ్లు ఎదురు ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ కు చెందిన ఘన్ శ్యామ్ ఓజా అనే వ్యక్తి ఆదివారం (ఏప్రిల్ 11)న వాక్సిన్ వేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.

వెంటనే వ్యాక్సినేషన్ 12వ తేదీకి (సోమవారం) షెడ్యుల్ చేయబడింది అంటూ మెసేజ్ వచ్చింది. దీనికి సంబంధించి ఓటీపీ కూడా వచ్చింది. ఆ ప్రకారం వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లిన ఘన్ శ్యామ్ కు మీ వ్యాక్సినేషన్ సక్సెస్ అంటూ మెసేజ్ రావడంతో కంగు తిన్నాడు.

తన ఆధార్ కార్డు, మొబైల్ నెం. తో తనకు తెలియకుండానే వేరేవాళ్లు టీకా తీసుకున్నారని తేలడంతో అవాక్కయ్యాడు.  తాను సెంటర్ కు మాత్రమే వచ్చానని.. ఇంకా టీకా వేయించుకోలేదని.. ఇదేదో ఫ్రాడ్ జరుగుతోందని.. ఇలాంటివి అరికట్టాలంటూ, దీనికి బాధ్యులైన వారిమీద తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. 

click me!