తెలంగాణా మీద తొలిసంతకం చేయడం కెసిఆర్ మానేస్తారా???

Published : Nov 04, 2016, 04:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
తెలంగాణా మీద తొలిసంతకం చేయడం కెసిఆర్ మానేస్తారా???

సారాంశం

గతంతో బంధం తెంచేసుకుని కొత్త తెలంగాణా,  కొత్త హైదరాబాద్ ప్రపంచానికి కనిపించేలా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లుంది. అందుకే  పాలనా కేంద్రాన్నిసమూలంగా మార్చేస్తున్నారు. ఖర్చుకు వేనకాడటం లేదు.

పటిష్టంగా ఉన్న సచివాలయాన్ని వాస్తు పేరుతో కూల్చాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును  కోరుతున్నారు. దాదాపు రు.350 కోట్లు ఖర్చయ్యే కొత్త సచివాలయ నిర్మాణా ప్రాజక్టు అవివేకపు నిర్ణయంగా వర్ణిస్తూ సహేతుకం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి గురువారం బహిరంగ లేఖ రాశారు. 

 

2014 జూన్ 2 నుంచి ఒక కొత్త తెలంగాణా శకం అవిర్భవించిందని చెప్పేందుకు రాజధాని పునర్వ్యవస్థీకరణకు ముఖ్యమంత్రి పూనుకున్నారని వేరే చెప్పనవసరంలేదు. హైదరాబాద్ లో ఉండేవన్నీ నిజాంలు కట్టించినవో లేదా ఆంధ్ర పాలకులు కట్టించినవో. దానికి తోడు,  చీటికి మాటికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటి వైపు చూపుడు వేలెత్తి  చూపి ఇదంతా నేనే కట్టించానని చెప్పుకుంటున్నాడు.

 

 

ఈ గత బంధం తెంచుకుని కొత్త తెలంగాణా,  కొత్త హైదరాబాద్ ప్రపంచానికి కనిపించేలా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లుంది. అందుకే  పాలనా కేంద్రాన్నిసమూలంగా మార్చేస్తున్నారు. ఖర్చుకు వేనకాడటం లేదు.  ఐటి మంత్రి  కెటి రామరావు కూడా ప్రపంచ దృష్టిని హైటెక్ సిటి నుంచి ఇతర   కేంద్రాల వైపు  మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  పేరున్న ఐటి కంపెనీలను రప్పించి హైదరాబాద్ ఐటి అడ్రసును చంద్రబాబు నాయుడు అడుగుజాడలు లేని ప్రాంతాలకు మారుస్తున్నారు.

 

హైదరాబాద్ మీద, తెలంగాణా మీద కెసిఆర్ తన సంతకం చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆయన పేర గుళ్లొస్తున్నయి. పార్టీలో ఉన్న వాళ్లు చాలా మంది  కెసిఆర్ ను తెలంగాణా జాతిపిత అని కూడా వర్ణిస్తున్నారు. కొ త్త వి కట్టాలనుకోవడం చాలా లోతైన రాజకీయ తాత్విక చింతన తో  తీసుకున్న నిర్ణయం.  ప్రపంచ వ్యాపితంగా, అన్ని కాలాలలోను బలమయిన పాలకులు చేసే పని చరిత్రమీద చెరగని రాజకీయ ముద్రవేయడమే.


 అయితే, ఇలాంటి  నిర్ణయాలు ఖర్చు తోకూడు కున్నవని చెబుతున్నారు ఉత్తమ్. ఇపుడంతా బాగానే ఉంది కదా, నిధులెందుకు దండగ అని టిపిసిసి అధ్యక్షుడు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


పటిష్టంగా ఉన్న సచివాలయాన్ని కూల్చి,  పన్నుల రూపేణా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేయొద్దని కోరారు. కొత్త సచివాలయాన్ని నిర్మించాలంటే వందల కోట్లు ఖర్చువుతాయని, అడబ్బుతో చాలా మంది రైతులను, విద్యార్థులను అదుకోవచ్చని ఆయన సూచించారు. ఇంత భారాన్ని ప్రజలపై మోపడం సబబు కాదని ఆయన చెప్పారు. 2008లో హెచ్ దక్షిణ  ఉత్తర బ్లాక్లను,  2003లో డి బ్లాక్ లను  1998లోొ ఎ బ్లాక్, జె బ్లాక్ లను  1990లో  ఎల్ బ్లాక్ ను, 1981లో సి,బి బ్లాక్ లను, 1978 లో కె బ్లాక్ ను, జె బ్లాచ్ ను, 1990 ఎల్ బ్లాక్, 1978 లో సి, బి బ్లాక్ లను,  1975 లో కె బ్లాక్ లను నిర్మించారని చెబుతూ ఇవే మంత పాతవని ఆయన ప్రశ్నించారు.

 

 ఇవి అన్ని రకాలుగా యోగ్యమయినవే నని ఆయన అన్నారు. వాస్తు పేరుతో  ఇన్ని భవనాలను, కూల్చడం ప్రజల మీద భారం మోయడం మంచిది కాదని చెబుతూ కెసిఆర్ కొత్త నిర్మాణ ప్రాజక్టు ధర రు. 350 కోట్ల ని చెప్పారు. అగ్ని మాపకశాఖ నిబంధనలకు ఈ  భవనాలు అనుకూలంగా లేవని తెలంగాణా అడ్వ కేట్ జనరల్ కోర్టుకు నివేదించడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు.

 

గతంలో ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులంతా భద్రత లేకుండానే పనిచేశారా అని ప్రశ్నించారు. జడ్‌ప్లస్ భద్రత ఉన్న వీరు ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోలేదా అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు, అనుమానాలకు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వాలన్నారు. ఏపీ సచివాలయాన్ని అమరావతికి తరలిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన దానికన్నా ఎక్కువ స్థలం ఉంటుందన్నారు. సచివాలయం కూల్చివేతను ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, నిపుణులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. .

 

  పన్నెండేళ్ల ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు గీస్తున్న కొత్త తెలంగాణా చిత్రపటాన్ని అడ్డుకోవడం కష్టమేమో...
 

PREV
click me!

Recommended Stories

KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu
Revanth Reddy vs KTR | రేవంత్ రెడ్డి vs కేటిఆర్ డైలాగ్ వార్ | Asianet News Telugu