అంతా మా ఇష్టమే : టిఎస్ పియస్ సి

Published : Nov 04, 2016, 03:33 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
అంతా మా ఇష్టమే : టిఎస్ పియస్ సి

సారాంశం

అతిజాగ్రత్త పేరుతో అభ్యర్థులపై ఆంక్షలు ఆంధ్రా అభ్యర్థులకు ఆప్షన్ ఇవ్వని జిల్లాల్లో సెంటర్ల ఏర్పాటు టిఎస్పియస్పి ‘అతి’పై మండిపడుతున్న అభ్యర్థులు

ఇన్నాళ్లు వరకు దేశంలో వ్యక్తులు ఎలా ఉండాలో మదరాసాలు మాత్రమే ఫత్వాలు జారీ చేసేవి. అది కూడా వాళ్ల మతానికి సంబంధించి మాత్రమే.. ఇప్పడు వాళ్లను స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా ఉంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్... అతి జాగ్రత్త పేరుతో అభ్యర్థులపై లేనిపోని ఆంక్షలు విధిస్తొంది. మా ఏగ్జామ్స్ రాసేవాళ్లు బూట్లు వేసుకోవద్దు... గోర్ల పేయింట్ వాడొద్దు..  మెహందీ పెట్టుకోవద్దు... అంటూ పెద్ద లిస్టు తయారు చేసి హాల్ టికెట్తో సహా వెబ్సైట్లో పెట్టింది.

 

ఇందంతా ఒక ఎత్తైతే తెలంగాణేతర ప్రాంత అభ్యర్థులు గ్రూప్2 ఏగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సుదూర ప్రాంతాల్లో ఏగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది.అదీకూడా ఆప్షన్ ఇవ్వని జిల్లాల్లో సెంటర్ కేటాయించడం దారుణమని అభ్యర్థులు వాపోతున్నారు.

 

‘ ఆంధ్రాలో గ్రూప్2 ఏగ్జామ్స్ త్వరలో జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రాక్టీస్ కోసం టిఎసిపియస్సి ఏగ్జామ్ రాయాలనుకున్నా... నేను హైదరాబాద్ సెంటర్ పెడితే నాకు మంచిర్యాల జిల్లాలో సెంటర్ అలాట్ చేశారు’ అంటూ ఓ ఆంధ్రా అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. తాతల కాలం నాటి నుంచి పక్కా హైదరాబాదీ అయిన ఒక అమ్మాయికి ముక్కు మొహం తెలియని ఖమ్మం జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయించింది. అలాగే వరంగల్ కు చెందిన మరో మహిళా అభ్యర్థికి హైదరాబాద్, వరంగల్ ఆప్షన్స్ ఇచ్చుకోగా ఆమెకు ఈ రెండింటితో సంబంధం లేని సంగారెడ్డిలో పరీక్ష సెంటర్ ఇచ్చారు. కరీంనగర్ కు చెందిన మరో అభ్యర్థికి వికారాబాద్ పరీక్ష కేంద్రం ఇచ్చారు.

 

  ఇచ్చిన ఆప్సన్లతో సంబంధం లేకుండా సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఈ తలతిక్క వేషాలు సవరించుకోవాలని సర్వీసు కమిషన్ పెద్దలను వేడుకుంటున్నారు అభ్యర్థులు.

PREV
click me!

Recommended Stories

Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు
IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ