టీఆర్ఎస్ లో శంకరమ్మకు అవమానం: ఉత్తమ్

By pratap reddyFirst Published Nov 17, 2018, 3:23 PM IST
Highlights

హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో శంకరమ్మ టీఆర్ఎస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

హుజూర్ నగర్: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అవమానించిందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, హుజూర్ నగర్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శంకరమ్మను కాంగ్రెసులోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 

హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో శంకరమ్మ టీఆర్ఎస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో ఎన్నారై శానంపూడి సైదిరెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇస్తూ శంకరమ్మకు నిరాకరించింది. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి, కోదాడ కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి రెడ్డితో పాటు ప్రజా కూటమి నేతలు పాల్గొన్నారు. 

నాలుగున్నరేళ్ల తన పాలనలో కేసిఆర్ ఒక్క సామాన్యుడినైనా కలుసుకున్నారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా ఒక్క మెగావాట్ విద్యుత్తు కూడా ఉత్పత్తి కాలేదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకున్నారని అంటున్న కేసీఆర్ డబుల్ బెడ్రూం, దళితులకు భూపంపిణీ వంటివాటిని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని అన్నారు. 

click me!