కూకట్ పల్లి అభ్యర్థిగా సుహాసినీ... ఐవైఆర్ సంచలన కామెంట్స్

By ramya neerukondaFirst Published Nov 17, 2018, 2:29 PM IST
Highlights

మహాకూటమిలో భాగంగా కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఈ రోజు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.

మహాకూటమిలో భాగంగా కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఈ రోజు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్ ఛరీష్మా,హరికృష్ణ సానుభూతితో   ఆ స్థానాన్ని గెలుచుకోవచ్చనే ఉద్దేశంతో ఆమెను చంద్రబాబు రంగంలోకి దింపాడు.

కాగా.. ఆమెకు టికెట్ కేటాయించడంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు తన ట్విట్టర్ లో స్పందించారు. కూకట్ పల్లి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక నియోజకవర్గం అని ఆయన పేర్కొన్నారు. కానీ.. ఆ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిని కేటాయించడంపై మీడియాలో వస్తున్న హడావిడి చూస్తుంటే.. వారి దృష్టిలో ఈ రెండు రాష్ట్రాల రాజకీయాలు ఒకటి రెండు కుటుంబాల కే పరిమితం కావాలన్న ఆకాంక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

 

కూకట్ పల్లి రెండుతెలుగురాష్ట్రాల్లో ఒక నియోజకవర్గం. కానీ ఆ ఒక నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గురించి మీడియాలో ఒక వర్గం చేస్తున్న హడావిడి చూస్తూ ఉంటే వారి దృష్టిలో ఈ రెండు రాష్ట్రాల రాజకీయాలు ఒకటి రెండు కుటుంబాల కే పరిమితం కావాలన్న ఆకాంక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది

— IYRKRao , Retd IAS (@IYRKRao)

సుహాసినీ టీడీపీ అభ్యర్థిగా కేటాయిస్తారన్న విషయం దగ్గర నుంచి ఆమె నామినేషన్ వేయడం.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని  మీడియా హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనో ఐవైఆర్ మీడియా పై సెటైర్ వేశారు. 

click me!