బుధవారం అసెంబ్లీలో ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం సమయంలో హరీష్ రావు మాట్లాడుతూ ఇరిగేషన్ పై కూడా మాట్లాడారు. దీంతో అసెంబ్లీని ఒకరోజు పొడిగించి, ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని యోచిస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలను రేపు కూడా కొనసాగించాలని అడగనున్నట్లు సమాచారం. బుధవారం అసెంబ్లీలో ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం సమయంలో హరీష్ రావు మాట్లాడుతూ ఇరిగేషన్ పై కూడా మాట్లాడారు. దీంతో అసెంబ్లీని ఒకరోజు పొడిగించి, ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి యోచిస్తున్నారు. ఈ మేరకే రేవంత్ తో సమావేశం అయ్యారు. మరి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయా? లేక రేపటివరకు పొడగిస్తారా? చూడాలి.