తెలంగాణలో కరోనా కలకలం ... హైదరాబాద్ లో కొత్త వేరియంట్ అనుమానిత కేసులు

By Arun Kumar P  |  First Published Dec 21, 2023, 10:30 AM IST

ఇప్పటికే దక్షిణభారత దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ ఎల్ఎన్.1 కేసులు వెలుగుచూసాయి. తాజాగా తెలంగాణలోనూ అనుమానిత కేసులు బయటపడుతున్నాయి. 


హైదరాబాద్ : ప్రపంచ దేశాలను మళ్లీ కరోనా మహమ్మారి భయపెడుతోంది. భారత్ లో కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటపడుతుండటంతో మళ్లీ ఆందోళన మొదలయ్యింది.ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా మరణాలు, కొత్త వేరియంట్ కేసులు నమోదవుతుండటంతో తెలంగాణ ప్రజల్లోనూ కలవరం మొదలయ్యింది. దీంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమై  తిరిగి కరోనా టెస్టుల సంఖ్యను పెంచింది. అంతేకాదు కరోనాకు సబంధించి రోజువారి వివరాలతో కూడిన బులెటిన్ ను తిరిగి విడుదల చేస్తోంది. దీనిప్రకారం తెలంగాణలో కొత్తగా నాలుగు కరోనా కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 9కి చేరింది.  

అయితే సాధారణ కరోనా కేసులే కాదు కొత్తగా బయటపడ్డ కోవిడ్ 19 ఎల్ఎన్.1 కేసులు తెలగాణ ప్రజలను కలవరపెడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ కొత్త వేరియంట్ కేసులు ఎక్కువగా భయపడుతుండటం... ఆ రాష్ట్రాలు తెలంగాణకు పొరుగునే వుండటమే ప్రజల భయానికి కారణం. ఇప్పటికే కేరళలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడగా తాజాగా మహారాష్ట్రలోనూ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. సిందుదుర్గ్ జిల్లాలో 41 ఏళ్ల మధ్యవయస్కుడు కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఎల్ఎన్ .1 బారినపడ్డాడు.

Latest Videos

ఇక కరోనాతో కర్ణాటకలో ఇద్దరు మరణించారు. వీరు సాధారణ కోవిడ్ కారణంగా చనిపోయారా లేక కొత్త వేరియంంట్ తో వల్లనా అన్నది తేలాల్సి వుంది. ఏదైమైనా మళ్ళీ కరోనా మరణాలు మొదలవడంతో ప్రజలను ఆందోళన కలిగిస్తోంది.

Also Read  తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా మరో 6 కేసులు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్  లో కూడా కోవిడ్ 19 న్యూ వేరియంట్ ఎల్ఎన్.1 అనుమానిత కేసులు వెలుగుచూస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో కొత్త వేరియంట్ లక్షణాలతో కొందరు చేరినట్లు తెలుస్తోంది. వారిని పరీక్షించగా ఒకరికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది... అయితే అధి కొత్త వేరియంట్ ఏమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు.   

తెలంగాణకు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుండి రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈరాష్ట్రాల్లో ఇప్పటికే కోవిడ్19 కొత్త వేరియంట్ ఎల్ఎన్.1 కేసులు వెలుగుచూసాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు వెళ్లివచ్చిన వారు ఎవరైన  కోవిడ్19 లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఇళ్లలోంచి బయటకు వచ్చేటపుడు  తప్పనిసరిగా మాస్కులు ధరించాలని...శానిటటైజర్ వాడాలని అధికారులు మళ్ళీ హెచ్చరికలు జారీ చేసారు. 
 

click me!