వరంగల్‌లో విషాదం:ప్రియుడు మోసం చేశాడని యువతి సూసైడ్

Published : Feb 27, 2023, 09:46 PM IST
  వరంగల్‌లో విషాదం:ప్రియుడు మోసం  చేశాడని  యువతి  సూసైడ్

సారాంశం

తెలంగాణలో  వేధింపుల  కారణంగా  ఇటీవల కాలంలో  యువతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.  


వరంగల్:;ప్రియుడు మోసం చేశాడనే  కారణంతో  యువతి  సోమవారంనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో  ఆత్మహత్య చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ కు  చెందిన   పోగుల ఉషారాణి ఆత్మహత్య చేసుకుంది. ల్యాబ్ టెక్నీషీయన్ కోర్సును  ఉషారాణి  చదువుతుంది.భూపాలపల్లి జిల్లాకు చెందిన ప్రశాంత్ కిషోర్ తో  ఉషారాణికి  పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం ప్రేమగా మారింది.  అయితే  ఉషారాణిని  పెళ్లి చేసుకునేందుకు ప్రియుడు  ప్రశాంత్ కిషోర్  నిరాకరించారు.  దీంతో మనోవేదనకు గురైన ఉషారాణి  ఇంట్లో  ఉరేసుకుని ఆత్మహత్య  చేసుకుంది.

also read:చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు: ప్రీతి ఘటనపై కెటిఆర్

ఉసారాణి ఆత్మహత్యతో  కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  ఉసారాణి ఆత్మహత్యకు కారణమైన  నిందితుడిని  కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాకు  చెందిన  మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా  కలకలం రేపుతుంది.  ఈ ఘటన మరువకముందే రక్షిత  అనే విద్యార్ధిని కూడా ఆత్మహత్య చేసుకుంది.  
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు