వివాదాస్పద వ్యాఖ్యలు: వరంగల్ లో బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి

Published : Feb 27, 2023, 08:42 PM ISTUpdated : Feb 27, 2023, 09:07 PM IST
వివాదాస్పద వ్యాఖ్యలు:  వరంగల్ లో  బైరి నరేష్ పై  అయ్యప్ప భక్తుల దాడి

సారాంశం

వరంగల్ పట్టణంలో బైరి నరేష్  పై ఇవాళ  అయ్యప్ప భక్తులు దాడి  చేశారు.  వివాదాస్పద వ్యాఖ్యలు  చేయడంతో  ఈ దాడి జరిగింది.  

వరంగల్: పట్టణంలోని  బైరి నరేష్  పై  సోమవారంనాడు సాయత్రం  అయ్యప్ప భక్తులు  దాడి  చేశారు. గతంలో  అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు  చేసిన బైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ  విషయమై  నమోదైన కేసులో  బైరి నరేష్  ను పోలీసులు అరెస్ట్  చేశారు.ఈ కేసులో  బెయిల్ పై  జైలు నుండి నరేష్ జైలు నుండి బయటకు వచ్చాడు.  జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత  కూడా బైరి నరేష్ వైఖరిలో మార్పు రాలేదు.  మరోసారి  అదే తరహలో  వివాదాస్పద వ్యాఖ్యలు  చేశాడు. ఈ వ్యాఖ్యలు  చేయడంతో  ఇవాళ బైరి నరేష్ పై  దాడి జరిగింది.  వరంగల్ లో  పోలీస్ రక్షణతో  వెళ్తున్న నరేష్ ను  కొందరు  పోలీస్ వాహనం నుండి లాగి  కొట్టారు.  

 

2022  డిసెంబర్ మాసంలో   ఓ వర్గం దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు.ఈ వ్యాఖ్యలపై  రాష్ట్ర వ్యాప్తంగా  పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు  చేసుకున్నాయి. ఈ విషయమై  పలు  పోలీస్ స్టేషన్లలో  బైరి నరేష్ కు వ్యతిరేకంగా  ఫిర్యాదులు  కూడా అందాయి, వికారాబాద్  జిల్లా కొడంగల్ లో  బైరి నరేష్ పై  కేసు నమోదైంది.  ఈ కేసులో  అరెస్టైన  నరేష్ ఫిబ్రవరి  16వ తేదీన  జైలు నుండి విడుదలయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?