కరోనా ఎఫెక్ట్: భారత్ పర్యటనకు దూరంగా ఉండాలని యూఎస్ వార్నింగ్

By narsimha lodeFirst Published Apr 20, 2021, 9:22 AM IST
Highlights

కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఇండియాకు ప్రయాణాలు మానుకోవాలని  అమెరికా తమ దేశ ప్రజలకు సూచించింది.

వాషింగ్టన్:  కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఇండియాకు ప్రయాణాలు మానుకోవాలని  అమెరికా తమ దేశ ప్రజలకు సూచించింది.వ్యాక్సిన్ వేసుకొన్నాక కూడ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని  అమెరికా తెలిపింది.  ఇండియాకు అత్యవసరమైతే తప్ప ప్రయాణీకులు పెట్టుకోవద్దని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఓ ప్రకటనలో తెలిపింది

ఒకవేళ ఇండియాకు ప్రయాణం చేయాల్సి వస్తే  పూర్తిగా టీకాలు తీసుకొన్న తర్వాతే  ప్రయాణం చేయాలని కోరింది.అమెరికన్లు అంతర్జాతీయ ప్రయాణాలపై  పున:పరిశీలన చేసుకోవాలని   ఆ దేశం కోరింది.అమెరికాలో ట్రంప్ అధ్యక్షఁ పదవి నుండి వైదొలిగిన తర్వాత  అంతర్జాతీయ  ప్రయాణానికి వ్యతిరేకంగా ఆ దేశం హెచ్చరికలు జారీ చేయలేదు.

ఇండియాలో కరోనా కేసులు పెరుగుదలను తగ్గించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సోమవారం ానడు కీలక నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మే నుండి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిక కరోనా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకొంది. వ్యాక్సిన్ బమిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకొంది. 
 

click me!