భార్య కాపురానికి రావడం లేదని... టెక్కీ మనస్తాపంతో..

Published : Apr 20, 2021, 08:35 AM ISTUpdated : Apr 20, 2021, 08:48 AM IST
భార్య కాపురానికి రావడం లేదని... టెక్కీ మనస్తాపంతో..

సారాంశం

లాక్ డౌన్ నేపథ్యంలో అతను గజ్వేల్ లో ఉంటూ ఇంటి వద్ద నుంచే ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. కాగా.. పెళ్లైన వారం రోజులకే ప్రవళిక పుట్టింటికి వెళ్లిపోగా... ఎన్నిసార్లు రమ్మని చెప్పినా.. ఆమె అతని వద్దకు రావడం లేదు.  

భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురై ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పట్టణానికి చెందిన పోతిరెడ్డి జీవన్ రెడ్డి(30) కి గత ఏడాది డిసెంబర్ లో మహబూబ్ నగర్ కి చెందిన కొమ్మారెడ్డి ప్రవళికతో వివాహం అయ్యింది. లాక్ డౌన్ నేపథ్యంలో అతను గజ్వేల్ లో ఉంటూ ఇంటి వద్ద నుంచే ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. కాగా.. పెళ్లైన వారం రోజులకే ప్రవళిక పుట్టింటికి వెళ్లిపోగా... ఎన్నిసార్లు రమ్మని చెప్పినా.. ఆమె అతని వద్దకు రావడం లేదు.

తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అందుకే తాను మీ ఇంటికి రానని చెప్పడంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జీవన్ రెడ్డి తన గదిలోకి వెళ్లి గడియ వేసుకొని ఉరి వేసుకున్నాడు. అంతకుముందు తన చరవాణిలో భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఉరి వేసుకుంటున్నానని వీడియో రికార్డు చేసి తల్లి సుందరి, ఇతర బంధువులకు పంపించాడు.

వీడియోను చూసిన తల్లి వెంటనే బంధువుల సాయంతో తలుపును పగలకొట్టి చూడగా... గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకొని కనిపించిన జీవన్ రెడ్డిని కిందకు దింపి.. సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu