ఉప్పల్ ఎమ్మెల్యే‌కి నిరసన సెగ: సూసైడ్ చేసుకొంటామని హెచ్చరిక

Published : Oct 15, 2020, 02:54 PM ISTUpdated : Oct 15, 2020, 03:19 PM IST
ఉప్పల్ ఎమ్మెల్యే‌కి నిరసన సెగ: సూసైడ్ చేసుకొంటామని హెచ్చరిక

సారాంశం

ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వరద పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు.

హైదరాబాద్:  ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వరద పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు.

భారీ వర్షంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గురువారం నాడు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన పరిశీలించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో తమను ఎవరూ కూడ పట్టించుకోవడం లేదని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

also read:బిర్యానీ కోసం వెళ్లి వాగులో చిక్కుకొన్నారు...

ఎమ్మెల్యే పేరున సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకొంటామని ఎమ్మెల్యే పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.భారీ వర్షం కారణంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. ఈ వరద నీటిలో స్థానికులు  తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద కారణంగా  స్థానికులు కొందరు సురక్షిత ప్రాంతాలకు వరద నీటిలోనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. నగర శివారులో సుమారు 32 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగరంలో కూడ సుమారు 20 సెంమీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో నగరంలో ఎక్కడా చూసినా వరద నీరు ముంచెత్తింది.

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?