హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఇంట్లోకి వరద నీరు: 4 రోజులుగా ఆఫీస్ నుండే విధులు

Published : Oct 15, 2020, 02:42 PM IST
హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఇంట్లోకి వరద నీరు: 4 రోజులుగా ఆఫీస్ నుండే విధులు

సారాంశం

భారీ వర్షాలతో హైద్రాబాద్ లో పలు ఇళ్లలో ఇంకా వరద నీరు నిలిచిపోయింది. హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఇంట్లో కూడ వరద నీరు చేరింది. దీంతో ఆయన తన కార్యాలయంలోనే ఉంటున్నారు.

హైదరాబాద్: భారీ వర్షాలతో హైద్రాబాద్ లో పలు ఇళ్లలో ఇంకా వరద నీరు నిలిచిపోయింది. హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఇంట్లో కూడ వరద నీరు చేరింది. దీంతో ఆయన తన కార్యాలయంలోనే ఉంటున్నారు.

హైద్రాబాద్ నగరానికి వరద ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పోలీసు శాఖ కూడ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.

హైద్రాబాద్ నగరంలో ఎలాంటి భారీ వర్షం కురిసింది. నగర శివారులోని హయత్‌నగర్, ఘట్‌కేశర్ ప్రాంతాల్లో 32 సెంమీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఇంట్లోకి వరద నీరు చేరింది. 

పని ఒత్తిడి కారణంగా ఇంటికి వెళ్లకుండా ఆయన కార్యాలయంలోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు.  వరద నీరు ఇంట్లోకి వచ్చిన విషయం తెలిసినా కూడ  ఆయన తన పరిధిలోని జల దిగ్భంధమైన ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలను తరలించే పనిలో బిజీగా ఉన్నారు.

మరో వైపు హైద్రాబాద్ నగరంలోని సుమారు 300 పొలీసుల ఇళ్లలోకి వర్షం నీరు చేరింది.తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు.గత నాలుగు రోజులుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తన కార్యాలయం నుండే విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.

 


 

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy in Assembly:మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ | Asianet News Telugu
CM Revanth Reddy Comments: ఆ వాటర్ ప్రాజెక్ట్ పై శాశ్వత సంతకం కేసీఆర్ చేశారు | Asianet News Telugu