బీజేపీలోకి ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి?

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సీటు దక్కకపోవడంతో ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. 

Uppal sitting MLA Bheti Subhash Reddy joining to BJP? - bsb

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలవ్వడంతో సిట్టింగ్ లు, ప్రస్తుతం సీటు దక్కని వారు పార్టీలు మారుతున్నారు. ఈ కోవలోనే ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పార్టీ మారుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన భేతి సుభాష్ రెడ్డికి ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు.దీంతో సుభాష్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. 

టికెట్ దక్కక పోవటంతో అదృష్టం పరీక్షించుకోవడం కోసం పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి మారబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్న బండారి లక్ష్మారెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారు.  

Latest Videos

తెలంగాణ భవితవ్యం మారబోతుంది..: కేటీఆర్‌ వ్యాఖ్యలకు ప్రకాష్ జవదేకర్ కౌంటర్

అయినా ఫలితం దక్కలేదు. దీంతో కొద్ది రోజులుగా సుభాష్ రెడ్డి  పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే భేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టుగా.. ఆ పార్టీ అగ్ర నేతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. 

vuukle one pixel image
click me!