కుప్పకూలిన లిఫ్ట్:ఉప్పల్ ఎమ్మెల్యేకి తప్పిన ముప్పు

Published : Jul 29, 2021, 04:32 PM IST
కుప్పకూలిన లిఫ్ట్:ఉప్పల్ ఎమ్మెల్యేకి తప్పిన ముప్పు

సారాంశం

ఉప్పల్ ఎమ్మెల్యేకు   గురువారంనాడు ముప్పు తప్పింది. ప్రైవేట్ ఆసుపత్రిలో  లిఫ్ట్ కుప్పకూలడంతో బోడుప్పల్ చైర్మెన్ బుచ్చిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.  

హైదరాబాద్: హైద్రాబాద్ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి గురువారం నాడు ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు.ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవానికి బోడుప్పల్ మేయర్ తో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఉప్పల్ నల్లచెరువులో ప్రైవేట్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి పై అంతస్తుకు లిఫ్టులో వెళ్తున్న ఎమ్మెల్యే సహా చైర్మెన్ తృటిలో ప్రాణాపాయం తప్పింది.  వీరంతా లిఫ్టులో వెళ్తున్న సమయంలో లిఫ్టు కుప్పకూలింది. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది  ఆసుపత్రి సిబ్బందిని పిలిచి  లిఫ్టు తలుపులు తెరిపించారు.బోడుప్పల్ ఛైర్మెన్ బుచ్చిరెడ్డితో పాటు కొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.గతంలో కూడ తెలుగు రాష్ట్రాల్లో లిఫ్ట్ లు కూలిన ఘటనలో ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. అయితే ఇవాళ జరిగిన ప్రమాదంలో ఎమ్మెల్యే సహ పలువురు ప్రమాదం నుండి  బయటపడ్డారు.లిఫ్ట్ ఎలా కూలిపోయిందనే విషయమై ఆసుపత్రి సిబ్బంది పరిశీలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu