
హైదరాబాద్: కృష్ణా నీటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ కేఆర్ఎంబీ లేఖ రాశారు.కృష్ణా బేసిన్ లో నీటిని ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీరిన తర్వాతే బేసిన్ అవతలికి తరలించాలని ఆ లేఖలో కోరారు. ఏపీ ప్రభుత్వం బేసిన్ పరిధి దాటి నీటిని మళ్లిస్తోందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. త్రిసభ్యకమిటీ ఆమోదం లేకుండానే పోతిరెడ్డి పాడు నుండి నీటి తరలింపును అనుమతించొద్దని ఆయన కోరారు.
2021-22 నుండి కృష్ణా నీటిని 50: 50 నిష్పత్తిలో పంచాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో వరద ఉన్నందున విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన ఈ డిమాండ్ పై ఏపీ అభ్యంతరం చెబుతోంది. గతంలో కుదిరిన ఒప్పందం మేరకే నీటిని వాడుకోవాలని ఏపీ ప్రభుత్వం చెబుతుంది.