
నారాయణపేట : గుర్తు తెలియని ఓ మహిళను అతి దారుణంగా murder చేసి.. తల, శరీర భాగాలను వేరు చేసి పారవేసిన ఘటన narayanpet districtలో సంచలనం సృష్టించింది. నారాయణపేట పట్టణ సమీపంలోని శ్యాసన్ పల్లి రోడ్డు మార్గంలో రోజూ మాదిరి సోమవారం ఉదయం అటుగా వెల్తున్న కొందరికి పెద్దఎత్తున దుర్వాసన వచ్చింది. అనుమానంతో రోడ్డు దిగువన పొలంగట్లవైపు వెళ్లి చూడగా.. ఓ మూటకట్టిన సంచిలో చిన్నపాటి మాంసం ముద్ద ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ సురేష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల, కాళ్లు, చేతులు లేకుండా మొండెం మాత్రమే ఉండి, చుట్టు పక్కల మహిళకు సంబంధించిన దుస్తులు లభించాయి. అప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులతో పాటు ఇతర జిల్లాలు పొరుగు ఉన్న కర్ణాటక పోలీసులకు సైతం సమాచారం అందించారు. ఇటీవల శ్యాసన్ పల్లిలో జాతర జరిగిందని, ఆ సమయంలో ఏమైనా గొడవ జరిగిందా .. అక్రమ సంబంధం కారణమా లేదా ఆస్తి వివాదాలతో ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇలాంటి ఘటనే ముంబయిలో వెలుగు చూసింది. ముంబయి: మహారాష్ట్రలోని ఓ మూసేసిన షాపులో మనిషి మెదడు, కళ్లు, చెవులు, ఇతర మనిషి భాగాలు లభించాయి. నాసిక్ లోని ఓ బిల్డింగ్ బేస్మెంట్ షాపులో ఇవి వెలుగులోకి వచ్చాయి. గత రెండు, మూడు రోజులుగా మూసేసిన ఆ షాపు నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే షాపు తెరిచి పరిశీలించారు.
అక్కడి దృశ్యం చూసి వారు షాక్ తిన్నారు. ఆ షాపు నిండా మొత్తం చెడిపోయిన సామాన్లు ఉన్నాయని పోలీసులు గమనించారు. కానీ, రెండు ప్లాస్టిక్ కంటైనర్లు అనుమానాస్పదంగా కనిపించాయని తెలిపారు. వాటిని విప్పి చూడగా, అందులో మనిషి కళ్లు, మెదడు, చెవులు, ఇతర ముఖ్య శరీరభాగాలు కనిపించాయని పేర్కొన్నారు. దీనిమీద వెంటనే ఫోరెన్సిక్ టీమ్ కు సమాచారం ఇచ్చారని వారు ఆ మనిషి శరీర భాగాలను కస్టడీలోకి తీసుకున్నట్టు ముంబయి నాకా పోలీసు స్టేషన్ అధికారులు తెలిపారు.
అయితే, ఆ షాపు యజమానికి ఇద్దరు కుమారులని, వారిద్దరూ డాక్టర్లేనని తెలిసింది. ఆ డాక్టర్లు మెడికల్ పర్పస్ లో ఈ అవయవాలను భద్రపరిచారా? అని అనుమానిస్తున్నారు. అయితే ఏదైనప్పటికీ.. తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్టు వివరించారు. నాసిక్ లోని ఈ భాగాలు లభించిన షాపు సుమారు 15 రోజులుగా మూసే ఉంది. ఈ ఘటన మీద పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కానీ, ఇది మర్డర్ కేసుగా వారు భావించడం లేదని తెలుస్తున్నది. షాపు యజమాని మాత్రం మానవ శరీర భాగాల గురించి తనకు తెలియదని అంటున్నట్టు సమాచారం.
ఈ ఘటనపై ఓ మీడియా సంస్థతో పోలీస్ కమిషనర్ పౌర్ణిమ చౌగులే మాట్లాడారు. ఒక దగ్గర శవం ఉన్నట్లు తెలిస్తే.. అక్కడ హత్య జరిగినట్టుగా భావిస్తామని తెలిపారు. కానీ, ఇక్కడ ఎనిమిది చెవులు, సరైన రీతిలో కట్ చేసి ఉన్నాయని వివరించారు. ఆ పని ప్రత్యేకంగా స్పెషలిస్టులు చేసినట్టుగానే ఉందని తెలిపారు. లేదా ఆ రంగంలో నైపుణ్యం ఉన్నవారు.. రోజూ అదే పని చేసే వారు చెవులను కట్ చేసినట్టు ఉన్నదని చెప్పారు.