ఏప్రిల్ లో వరంగల్ లో రాహుల్ సభ:టీ.పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్ణయం

Published : Mar 28, 2022, 10:14 PM IST
ఏప్రిల్ లో వరంగల్ లో రాహుల్ సభ:టీ.పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్ణయం

సారాంశం

తెలంగాణలో ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో రాహుల్ గాంధీతో సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.  రానున్న రోజుల్లో నిర్వహంచే ఆందోళన కార్యక్రమాలపై పీసీసీ సోమవారం నాడు రాష్ట్ర కార్యవర్గం చర్చించింది. 

హైదరాబాద్: Telangana రాష్ట్రంలో ఏప్రిల్ చివర్లో Rahul Gandhiపర్యటనను ఏర్పాటు చేయాలని తెలంగాణ Congress పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు..

సోమవారం నాడు TPCC రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. జూమ్ యాప్ ద్వారా ఈ సమావేశం నిర్వహించారు. సుధీర్గంగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ నిర్వహించాల్సిన ఆందోళన కార్యక్రమాలపై కూడా చర్చించారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణను AICC ఇప్పటికే ప్రకటించింది.మార్చి చివరి నాటికి పంచాయితీ కార్యాలయాలు, ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేలా చూడాలని క్షేత్ర స్థాయి నాయకులు చూడాలని  రాష్ట్ర నాయకత్వం కోరింది.

మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఆందోళనలు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. సీనియర్ నేతలు ఆయా ప్రాంతాల్లో  పర్యటించాలని కూడా పీసీసీ నిర్ణయం తీసుకొంది. వరి ధాన్యం కొనుగోలు విషయమై  నెల రోజుల పాటు ఆందోళనలకు పీసీసీ ప్లాన్ చేసింది.
 ఏప్రిల్ చివర్లో రైతు ఉద్యమాల ముగింపును పురస్కరించుకొని  వరంగల్ వేదికగా సభను నిర్వహించాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. 

Paddy ధాన్యం కొనుగోలుకు సంబంధించి మాజీ మంత్రి Sridhar Babu నేతృత్వంలో  సీనియర్లతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.ఏప్రిల్ 2 నుండి 4 వరకుధరల పెరుగుదల నిరసిస్తూ మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తారు.ఏప్రిల్ 7న పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద విద్యుత్ సౌధ వద్ద ధర్నా నిర్వహించాలని తలపెట్టారు.మరో వైపు 111 జీవోపై మాజీ ఎమ్మెల్యే  మర్రి శశిధర్  రెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం