
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై BJP ఫోకస్ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. పార్టీ అగ్ర నేతల మధ్య సరైన సమన్వయం లేదనే ప్రచారం కూడా సాగుతున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత కార్యదర్శి BL Santosh ఈ నెల 29న హైద్రాబాద్ కు రానున్నారు.
Telangana రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. తెలంగాణలో పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచడంతో పాటు ఇతర పార్టీల నుండి వలసలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకత్వం చర్చించనుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay తీరును నిరసిస్తూ కొందరు నేతలు సమావేశాలు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా Karimnagar జిల్లాకు చెందిన నేతలున్నారు. ఈ విషయమై పార్టీ అధిష్టానానికి కూడా ఇప్పటికే పిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో బీఎల్ సంతోష్ రాష్ట్ర పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.
తెలంగాణ రాష్ట్రంలో KCR సర్కార్ పై బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ నేతలు దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అయితే పార్టీలో కీలక నేతల మధ్య సమన్వయం లేదనేది చర్చగా మారింది.
రానున్న ఎన్నికల నాటికి క్షేత్ర స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం ఏం చేయాలనే దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితిలో బీజేపీ నేతలున్నారు. అయితే పార్టీ నేతల మధ్య సమన్వయం మరింత పెరిగితే రాజకీయంగా మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉందని కమలదళం భావిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ మాసంలో కేంద్ర హోం శాఖ మంత్ర Amit shah పర్యటించే అవకాశం ఉంది. అమిత్ షా రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు.