
జగిత్యాల : Jagityala జిల్లాలో బుధవారం మరో murder వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం జగిత్యాల రూరల్ మండలం వాడపల్లి శివారులోని ఊర చెరువులో fishes పట్టేందుకు బుధవారం ఉదయం మత్స్యకారులు వెళ్లారు. అక్కడ ఓ మహిళ (సుమారు 35సం.లు) dead body కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం వేకువజామున హత్యకు గురైనట్లు సంఘటనా స్థలంలో కనిపిస్తున్న ఆనవాళ్ళను బట్టి పోలీసులు భావిస్తున్నారు.
ఎక్కడి నుంచో ఓ మహిళను తీసుకువచ్చి.. మద్యం తాగించి.. అత్యాచారం చేసి.. ఆమె ప్రతిఘటించడంతో గొంతుకోసి.. తలపై బాది చంపినట్లు అనుమానిస్తున్నారు. జగిత్యాల డిఎస్పి ప్రకాష్ మృతదేహాన్ని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో అదృశ్యమైన మహిళ కేసు నమోదుపై ఆరా తీస్తున్నారు. లైంగిక దాడికి గురైన మహిళ ఎవరు? ఆమె పై అత్యాచారం చేసిన వారు ఎవరు? అనే విషయం ప్రస్తుతం తెలియరాలేదని డిఎస్పీ తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. తనని ప్రేమించడం లేదని కోపంతో రాయితో యువకుడు యువతిని కొట్టి హత్య చేశాడు. ఆమె సోదరిపై కూడా హత్యాయత్నంచేశాడు. సేలం ఆత్తూరులో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. సేలం జిల్లా గంగవల్లి సమీపంలోని కుడుమలై గ్రామానికి చెందిన మురుగేశన్ (45) రైతు. కడంబూరులో లీజుకు పంట పొలాన్ని తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు భార్య దయ(40), పెద్ద కుమార్తె నందిని( 21), చిన్న కుమార్తె రోజా(19), కుమారుడు విజయ్(18) ఉన్నారు. పంట పొలంలో నివాసం ఉంటున్నారు. చిన్న కుమార్తె రోజా నర్సింగాపురంలోని కళాశాలలో బీఏ చదువుతోంది.
ఆత్తూరు తండయార్ పేటకు చెందిన స్వామిదురై (22) చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్నాడు. కుడుమలైలోని బంధువు చిన్నదురై ఇంటికి ఇటీవల వచ్చాడు. ఆ సమయంలో రోజా అతని కంటపడింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమ పేరిట వేధించడం మొదలుపెట్టాడు. ఆమె కోసం తరచూ చెన్నై నుంచి చిన్నదురై ఇంటికి వచ్చి వెళ్లేవాడు. తన సోదరి నందినికి ఈనెల 13న వివాహం ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో స్వామిదురై వేధింపులు రోజాకు తలనొప్పిగా మారాయి. దీంతో వారం రోజుల క్రితం అతడిని తీవ్రంగా మందలించింది. అయినా అతడు వినలేదు. సోమవారం ఆమె చదువుకుంటున్న కాలేజీ వద్దకు వెళ్లి తన ప్రేమను చెప్పడమే కాకుండా, అంగీకరించకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన రోజా ఈ విషయాన్ని సోదరి నందిని ద్వారా తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్ళింది.
పెద్దల పంచాయతీతో ఆగ్రహం…
ఈ వ్యవహారం గ్రామపెద్దల వరకు వెళ్ళింది. దీంతో మంగళవారం రాత్రి పంచాయతీ పెట్టారు. ఇకపై స్వామిదురై గ్రామంలోకి రాకూడదని, రోజాను ప్రేమ పేరిట వేధిస్తే పోలీసులకు పట్టిస్తామని అతని బంధువు చిన్నదురై కు గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్వామిదురై ఉన్మాదిగా మారాడు. బుధవారం నందిని వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు రోజా తల్లిదండ్రులు, సోదరుడు బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టించాడు. తన మిత్రులతో కలిసి రోజా, ఆమె సోదరి నందిని పై దాడి చేశాడు.
ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ప్రయత్నం చేశాడు. వీరి నుంచి అక్క చెల్లెలు తప్పించుకుని పంట పొలంలోని నీటి తొట్టెలోకి దూకేశారు. రక్షించాలని కేకలు పెడుతూ అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే, రోజాను వెంటాడి మరీ ఆ ప్రేమోన్మాది తన మిత్రుల సాయంతో రాళ్ళతో కొట్టి పడేశాడు. నందిని కేకలు విని స్థానికులు రావడంతో ప్రేమోన్మాది పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న రోజాను ఆస్పత్రికి తరలించగా ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న చిన్నదురై, అతని మిత్రుడు సమీపంలోని అడవుల్లోనే ఉన్నారనే... సమాచారంతో డీఎస్పీ రామచంద్రన్ నేతృత్వంలో గాలింపు చేపట్టారు.