తెలంగాణా గవర్నర్ మ‌హిళ ద‌ర్బార్‌.. లక్ష్మణరేఖ దాటుతున్నార‌న్న సీపీఐ నారాయ‌ణ

Published : Jun 09, 2022, 10:57 AM ISTUpdated : Jun 09, 2022, 11:02 AM IST
తెలంగాణా గవర్నర్ మ‌హిళ ద‌ర్బార్‌.. లక్ష్మణరేఖ దాటుతున్నార‌న్న సీపీఐ నారాయ‌ణ

సారాంశం

Governor Tamilsai: తెలంగాణ గవర్నర్ త‌మిళి సై.. లక్ష్మణ రేఖ దాటుతున్నారనీ, గవర్నర్ మహిళా దర్బార్ ను ఎందుకు పెడుతున్నారని సీపీఐ నాయ‌కుడు నారాయ‌ణ‌ ప్రశ్నించారు.  

naaraayana cpi: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా తమిళిసై రాజ్ భవన్ వేదికగా ప్రజాదర్బార్ నిర్వహించాల నిర్ణ‌యం తీసుకుని దాన్ని అమ‌ల్లోకి తీసుకువ‌చ్చారు. దీనిపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సీపీఐ నాయ‌కుడు నారాయ‌న స్పందిస్తూ.. గ‌వ‌ర్న‌ర్ రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా రాజ‌కీయ కార్య‌క‌లాపాలకు తెర‌లేపుతున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. "ఈరోజు మహిళల దర్బార్ దేనికిపెడుతున్నారు ?  సహజంగా ఎవ‌రైనా ప్రతినిధి వర్గం వస్తే క‌ల‌వ‌వ‌చ్చు. వారిచ్చే  స‌మ‌స్య‌ల వినతిపత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి పంపవచ్చు . అంతేగాని గ‌వ‌ర్న‌ర్ రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భ‌వ‌న్ ను దుర్వినియోగం చేస్తున్నది" అని నారాయ‌ణ అన్నారు. "వీరికి కూడా రాజకీయ నేప‌థ్యం ఉన్న సంగతి తెలుసు . అయితే వేషం మార్చుకుని తటస్థ బాధ్య‌త‌తో వ‌చ్చింది కాదా? ఆమేరకే వారిప్రవర్తన వుండాలి" అని అన్నారు.  

ఒక వైపు బీజేపీ రాజకీయ దాడి పెంచింది. మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి ఆజ్యం పోస్తోందని నారాయణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గవర్నర్ పాత్ర రాజకీయ పరంగా ఉంద‌నీ, ఇది ఫెడరల్ రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేఖం అని.. మహిళా దర్బార్ రద్దు చేయాలని అన్నారు. అలాగే, అధికార పార్టీ టీఆర్ఎస్ పై విధాన పరంగా సీపీఐ పోరాడుతుందని ఆయన స్ప‌ష్టం చేశారు. జూబ్లీహిల్స్ పబ్ వ్యవహారంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మైనర్లను పబ్ కు అనుమతించడం చట్టరిత్యా నేరమని.. ఆ పబ్ ను సీజ్ చేసి యజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం ఘటనను మసిపూసి మారేడు కాయ చేస్తోంది ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్ రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా న‌డుచుకోవాల‌ని కోరారు. 

ఇదిలావుండ‌గా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా తమిళిసై రాజ్ భవన్ వేదికగా ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం గవర్నర్ తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం, గ‌వ‌ర్న‌ర్ కు మ‌ధ్య గ్యాప్ పెద్ద‌గానే ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యంతో ఏం జ‌రుగుతుందో చూడాలి... కాగా, మహిళల సమస్యలను తెలుసుకొనేందుకు తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan ఈ నెల 10వ తేదీన రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ దర్బార్ లో పాల్గొనే మహిళలు ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు మహిళా దర్బార్ ను నిర్వహించాలని Raj Bhavan  వర్గాలు తెలిపాయి. Telangana రాష్ట్రంలో గత నెలలో వరుస అత్యాచారాలు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. హైద్రాబాద్ అమ్నేషియా పబ్ తో పాటు మరికొన్ని ఘటనలతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.ఈ తరుణంలో Governor మహిళ దర్బార్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే