ఏపీ కంటే తెలంగాణ నుండే అధికంగా బియ్యం సేకరణ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి

By narsimha lodeFirst Published Dec 1, 2021, 3:49 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ నుండే ఎక్కువ బియ్యాన్ని సేకరించామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ నుండే ఎక్కువ బియ్యం సేకరించినట్టుగా కేంద్ర  ఆహార శాఖ సహాయ మంత్రి Sadhvi Niranjan Jyoti ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీ Kesineni Nani అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.  2020-21 లో ఏపీ నుండి 56.67 లక్షల మెట్రిక్ టన్నలు Rice సేకరించినట్టుగా మంత్రి తెలిపారు. అదే సంవత్సరం Telangana నుండి 94.53 లక్షల టన్నుల బియ్యం సేకరించామన్నారు. 2019-20 లో ఏపీ నుండి 53.33 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుండి 74. 54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని మంత్రి వివరించారు. 2018-19 లో Andhra pradesh నుండి 48.06 లక్షలు, తెలంగాణ నుండి 51.90 లక్షల మెట్రిక్ టన్ను బియ్యం సేకరించినట్టుగా సాధ్వి నిరంజన్ తెలిపారు. ఏపీ కంటే తెలంగాణ నుండే ఎక్కువ బియ్యం సేకరించామని కేంద్ర మంత్రి  చెప్పారు.

also read:కేసీఆర్ కు చిల్లర గాళ్ళు కాదు.. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి.. జగదీశ్ రెడ్డి (వీడియో)

Paddy ధాన్యం కొనుగోలు అంశంపై Trs,Bjp మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వరి ధాన్యం  కొనుగోలు విషయమై కేంద్రం నుండి స్పష్టత ఇవ్వాలని టీఆర్ఎస్ కేంద్రంపై యుద్ధానికి సిద్దమైంది. పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.  బీజేపీపై, కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా కేంద్రంపై ఒంటి కాలిపై ఈ విషయమై విమర్శలు చేస్తున్నారు. బీజేపీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నేతలు కూడా టీఆర్ఎస్ పై అదే స్థాయిలో మండిపడుతున్నారు. వర్షాకాలంలో వరి ధాన్యం కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తోంటే ఇంత కాలం తామే కొనుగోలు చేస్తున్నామని టీఆర్ఎస్  నేతలు చేస్తున్న ప్రచారంపై బీజేపీ నేతలు మండి పడ్డారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవబోమని  కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే తాము చూస్తూ ఊరుకొంటామా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.

click me!