కొడాలి నాని, వంశీలను లేపేస్తే.. రూ.50 లక్షల రివార్డ్ : టీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Dec 01, 2021, 03:15 PM ISTUpdated : Dec 01, 2021, 03:25 PM IST
కొడాలి నాని, వంశీలను లేపేస్తే.. రూ.50 లక్షల రివార్డ్ : టీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

సారాంశం

టీఆర్ఎస్ (trs) నేత, మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు (malladi vasu) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చీడ పురుగులైన కొడాలి నాని (kodali nani) , వల్లభనేని వంశీలతో (vallabhaneni vamsi) పాటు అంబటి రాంబాబును (ambati rambabu) భౌతికంగా నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

టీఆర్ఎస్ (trs) నేత, మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు (malladi vasu) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చీడ పురుగులైన కొడాలి నాని (kodali nani) , వల్లభనేని వంశీలతో (vallabhaneni vamsi) పాటు అంబటి రాంబాబును (ambati rambabu) భౌతికంగా నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురిని భౌతికంగా లేకుండా చేస్తే రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. పరిటాల రవి బతికుంటే ఇవాళ ఏపీలో ఈ పరిస్ధితి వచ్చేది కాదన్నారు.

పరిటాల రవి (paritala ravi) హత్య వెనుక ఆనాటి ప్రభుత్వ పెద్దల హస్తముందని ఆయన ఆరోపించారు. మొద్దుశ్రీను అనే క్రిమినల్‌ను పెట్టి ఒక ఆపరేషన్ ప్లాన్ చేసి.. పరిటాల రవిని హత్య చేశారని మల్లాది వాసు ఆరోపించారు. సమయం ఆసన్నమైందని.. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని, కులంలో వున్న కొన్ని చీడ పురుగుల్ని ఏరేసే ఆపరేషన్ ప్రారంభించాలని మల్లాది వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కౌన్సిలర్‌గా వున్న మల్లాది వాసు... కమ్మ సంఘం వన సమారాధనలో ఈ కామెంట్స్ చేశారు.

Also Read:నిండు సభలో భార్యపై అనుచిత వ్యాఖ్యలు... బోరున విలపించిన చంద్రబాబును పరామర్శించిన రజనీకాంత్

కాగా.. నవంబర్ 19న జరిగిన ఏపీ అసెంబ్లీ పరిణామాలతో చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఆవేదనను రాష్ట్రప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోనే భావోద్వేగానికి లోనయిన ఆయన బోరున విలపించారు. తన భార్య భువనేశ్వరి గురించి వైసిపి నాయకులు నిండుసభలో అవమానకరంగా మాట్లాడారంటూ చంద్రబాబు వెక్కి వెక్కి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు.  

జరిగిన ఘటనపై ఏం చెప్పాలో కూడా అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో తెల్చుకున్న తర్వాతే తిరిగి అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు శపధం చేసారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న చంద్రబాబు కుటుంబం పట్ల వైసిపి నేతలు నిండుసభలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడాన్ని TDP నాయకులే కాదు సీనీ ప్రముఖులూ ఖండిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్