తెలంగాణ నుంచి ధాన్యం కొనలేం : లోక్‌సభ సాక్షిగా తేల్చిచెప్పేసిన పీయూష్ గోయల్

Siva Kodati |  
Published : Mar 23, 2022, 02:38 PM ISTUpdated : Mar 23, 2022, 02:45 PM IST
తెలంగాణ నుంచి ధాన్యం కొనలేం : లోక్‌సభ సాక్షిగా తేల్చిచెప్పేసిన పీయూష్ గోయల్

సారాంశం

తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ మేరకు లోక్‌సభలో ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే వున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఏం చేస్తారో చూడాలి.

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల (paddy procurement) వ్యవహారం హాట్ హాట్‌గా వున్న సంగతి తెలిసిందే. దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు కేసీఆర్ (kcr) రెడీ అయ్యారు. ఈ మేరకు మంత్రులతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (piyush goyal) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమన్నారు. ఈ మేరకు లోక్‌సభలో పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. సరఫరా పరిస్ధితుల ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయన్నారు. అదనంగా వున్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోళ్లు వుంటాయని పీయూష్ గోయల్ వెల్లడించారు. 

కాగా.. యాసంగిలో Paddy ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం నాడు Delhiకి బయలు దేరిన సంగతి తెలిసిందే. Punjab  రాష్ట్రం నుండి కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది. ఈ విషయమై కేంద్ర ఆహార శాఖ మంత్రిని కలిసేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లు ఢిల్లీకి వెళ్లారు.

సోమవారం నాడు TRS శాసనసభపక్ష సమావేశం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సమావేశం తర్వాత యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని  ఈ సమావేశం డిమాండ్ చేసింది. కేసీఆర్ ఆదేశం మేరకు ఇవాళ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆహార్ శాఖ మంత్రి Piyush Goyal  ను కలిసి రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోతే తెలంగాణ తరహలోనే పోరాటం నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నారు.

అంతకుముందు ఢిల్లీకి బయలుదేరే ముందు Shamshabad విమానాశ్రయంలో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని కోరుతామన్నారు. పంజాబ్ లో మద్దతు ధరకు వరి ధాన్యం కొంటున్నట్టు తెలంగాణ  రాష్ట్రం ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సిందిగా కోరారు.  ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.రాష్ట్రం నండి బియ్యాన్ని కేంద్రమే  తీసుకువెళ్లాలన్నారు. .కానీ తీసుకు వెళ్లకుండా తమపై నిందలు మోపడం విడ్డురంగా ఉందన్నారు. బియ్యం సరఫరా కోసం రైల్వే వ్యాగన్లను సమకూర్చుమంటే సమకూర్చలేదు మళ్ళీ తమపై నిందలు వేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండి పడ్డారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cashless Healthcare Trust: ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఇకపై రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం !
Hyderabad Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సునామీ.. పక్కనే మరో భాగ్యనగరం !