హైదరాబాద్ నైపర్‌లో రూ. 100 కోట్లతో సొంత క్యాంపస్.. శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి మాండవీయా

Published : Dec 18, 2022, 12:34 PM IST
హైదరాబాద్ నైపర్‌లో రూ. 100 కోట్లతో సొంత క్యాంపస్.. శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి మాండవీయా

సారాంశం

భారత్‌లో పరిశోధనలు, ఆవిష్కరణలు పోటీ పడుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయని కేంద్ర రసాయనాలు- ఎరువులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా అన్నారు. 

భారత్‌లో పరిశోధనలు, ఆవిష్కరణలు పోటీ పడుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయని కేంద్ర రసాయనాలు- ఎరువులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా అన్నారు. హైదరాబాద్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌)కు సంబంధించి ఆధునిక క్యాంపస్ నిర్మాణానికి శనివారం మాండవీయా శంకుస్థాపన చేశారు. ఈ అత్యాధునిక క్యాంపస్‌ను రూ. 100 కోట్లతో నిర్మించననున్నారు. అలాగే ఎన్‌ఏబీఎల్‌గా గుర్తింపు పొందిన అనలిటికల్ టెస్టింగ్ లాబొరేటరీ అండ్ మెడికల్ డివైసెస్ లాబొరేటరీని కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవీయా మాట్లాడుతూ.. ‘‘NIPER శాశ్వత క్యాంపస్ క్వాలిటీ, రీసెర్చ్‌కు మైలురాయిగా ఉంటుంది. ఉత్సహవంతుల్లో వారి జ్ఞానాన్ని మెరుగుపరచడానికి ప్రేరేపిస్తుంది. త్వరలో మొదటి దశతో నిర్మాణ ప్రణాళిక ప్రారంభం కానుంది. ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. 

నైపర్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ శశిబాలా సింగ్ మాట్లాడుతూ.. శాశ్వత క్యాంపస్ నిర్మాణం వల్ల ఇన్‌స్టిట్యూట్ అన్ని కోణాల్లో బలోపేతం అవుతుందని చెప్పారు. క్యాంపస్‌లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున విద్యార్థులు తమ సమయాన్ని పూర్తిగా పరిశోధనకే వెచ్చించగలరని అన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu