ఇవాళ సాయంత్రం హైద్రాబాద్‌కు కిషన్ రెడ్డి: పార్టీ నేతలతో భేటీ

By narsimha lode  |  First Published Jul 5, 2023, 1:46 PM IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇవాళ సాయంత్రం  హైద్రాబాద్ కు వస్తారు. 



హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమాకమైన  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారంనాడు సాయంత్రం  హైద్రాబాద్ కు రానున్నారు.  బీజేపీ ఆఫీస్ లో  పార్టీ ముఖ్య నేతలతో  కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు.  రేపు ఉదయం కిషన్ రెడ్డి వరంగల్ వెళ్లనున్నారు.  రేపటి నుండి మూడు రోజుల పాటు  వరంగల్ లోనే  కిషన్ రెడ్డి ఉంటారు. బీజేపీ పదాధికారుల సమావేశంలో   కిషన్ రెడ్డి పాల్గొంటారు.    ప్రధాని మోడీ  పర్యటనను విజయవంతం  చేయాల్సిన విషయమై  పార్టీ నేతలతో చర్చించనున్నారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  కిషన్ రెడ్డిని  ఆ పార్టీ నాయకత్వం  నిన్న  నియమించింది.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత కిషన్ రెడ్డి స్పందించలేదు.  ఇవాళ  ఉదయం  కేంద్ర కేబినెట్  సమావేశం జరిగింది. ఈ సమావేశానికి  కిషన్ రెడ్డి హాజరు కాలేదు.  అనారోగ్యం కారణంగానే  కేబినెట్ సమావేశానికి   కిషన్ రెడ్డి హాజరు కాలేదు.

Latest Videos

ఈ విషయమై  కిషన్ రెడ్డి కేబినెట్ సెక్రటరీకి సమాచారం పంపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ  సునీల్ భన్సల్  న్యూఢిల్లీలో  ఇవాళ మధ్యాహ్నం కిషన్ రెడ్డితో  సమావేశం కానున్నారు.  రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై  సునీల్ భన్సల్ తో  కిషన్ రెడ్డి చర్చించనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన  కిషన్ రెడ్డికి  ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. 

also read:కేంద్ర కేబినెట్ భేటీ: కిషన్ రెడ్డి దూరం, రాజీనామా చేస్తారా?

నిన్న హైద్రాబాద్ నుండి  కిషన్ రెడ్డి న్యూఢిల్లీకి వచ్చారు.  ఇవాళ ఉదయం నుండి  కిషన్ రెడ్డి  న్యూఢిల్లీలోని తన నివాసంలోనే  ఉన్నారు.  పార్టీ అధ్యక్షుడిగా  నియామకమైన తర్వాత  న్యూఢిల్లీ నుండి  కిషన్ రెడ్డి  ఇవాళ సాయంత్రం  హైద్రాబాద్ కు రానున్నారు. 


 

click me!